Home / General / హైదరాబాద్ లో ప్లాస్టిక్ బియ్యం ??

హైదరాబాద్ లో ప్లాస్టిక్ బియ్యం ??

Author:

ఇప్పుడు ఏ పేపర్ చూసినా, టీవీ చూసినా ఇవే వార్తలు. ఫలానా చోట ప్లాస్టిక్ బియ్యం అని. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బియ్యం కలకలం హైదరాబాదు కి కూడా విస్తరించిందనే వార్త రావటంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మీర్ పేట్ లోని నందనవనంలో ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నారనే వార్తలు వెలువడడంతో ఒక్కసారిగా జనంలో భయం మొదలైంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో చాలా మంది ప్లాస్టిక్ బియ్యం వీడియో లు అప్లోడ్ చేస్తుండడం తో అసలు ఏది మంచి, ఏది కల్తీ తెలియని సందిగ్ద స్థితిలో పడిపోయారు జనాలు.

plastic rice in hyerabad going viral

మీర్ పేట్ లోని నందనవనంకి చెందిన అశోక్ ఓ కిరాణా షాపులో బియ్యం కొన్నాడు. ఇంటికి వెళ్లి ఎప్పటిలాగే అన్నం వండాడు. అయితే అన్నం కొంచం తేడాగా అన్పించడంతో.. అన్నాన్ని ముద్దలు చేసి నేలకేసి కొట్టాడు.ఆ ముద్దలు బాల్ లా ఎగురుతుండటంతో షాక్ అయ్యాడు. ప్లాస్టిక్ బియ్యంలా ఉన్నాయన్న అనుమానంతో వెంటనే షాప్ కి వెళ్లి యజమానిని నిలదీశాడు. అయితే, తనకేం తెలీదని.. తనకు సప్లై అయిన బియ్యాన్నే నేను అమ్మానని కిరాణా షాపు యజమాని చెప్పడంతో, చివరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు అన్నాన్ని పరీక్షలకు పంపించారు. ఈ అనుమానిత బియ్యం ఎవరు సప్లయ్ చేశారు? ఎక్కడ తయారయ్యాయి అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ షాపుకి సరఫరా చేసిన బియ్యమే ఇంకా ఎక్కడైనా సరఫరా అయ్యాయా..? అక్కడి పరిస్థితి ఏంటి అని కూడా వాకబు చేస్తున్నారు. అయితే ఇవి ప్లాస్టిక్ బియ్యం అని ఇంకా ఎలాంటి నిర్ధారణ జరగలేదు.

ఇలా హైదరాబాద్ లో ప్లాస్టిక్ బియ్యం వార్త వెలువడిందో లేదో కర్నూలు జిల్లా శ్రీశైలంలోనూ నకిలీ బియ్యం అనే వార్త మరింత కలకలం రేపింది. శ్రీశైలంలోని ఓ షాపులో కొనుగోలు చేసిన బియ్యంలో ప్లాస్టిక్ రైస్ ఉందని వాపోతున్నారు స్థానికులు. ఈ బియ్యం వండుకుని తింటే కడుపునొప్పి వస్తుందని ఇప్పటికే తిని అనారోగ్యం పాలయ్యామని కొందరు బాధితులు చెబుతున్నారు. ఈ నకిలీ బియ్యం కర్నూలు, నంద్యాల నుంచి వస్తున్నాయ౦టున్నారు వ్యాపారులు.

ఈ వార్తల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలీనప్పటికీ ప్రజలు మాత్రం తమ ఆహారం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే చాలా చోట్ల ఇలా ప్లాస్టిక్ బియ్యం అమ్మేస్తున్నారని, వండిన తర్వాత అన్నం ముద్ద బాల్స్ లాగా ఎగురుతుందనీ వాట్సాప్ లో, ఆన్ లైన్లో విపరీతంగా షేర్ అవుతున్నప్పటికీ అవేవి నిజం కాదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జన విజ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు.

(Visited 508 times, 1 visits today)