Home / health / మీ బియ్యం అసలైనదో నకిలీదో తెలుసుకోవాలంటే ఇవి చేయండి.

మీ బియ్యం అసలైనదో నకిలీదో తెలుసుకోవాలంటే ఇవి చేయండి.

Author:

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బియ్యం అనే వార్తలతో ప్రజలు భయాందోళన లకు గురవుతున్నారు. అయితే కంగారు పడాల్సిన పని అక్కర్లేదు. మీరు కొన్నవి సాధారణ బియ్యమో ప్లాస్టిక్ బియ్యమో కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ కింద తెలిపిన ఐదు రకాల పరీక్షలు చేసి మీరు కొన్నవి మంచి బియ్యమో కావో తెలుసుకోవచ్చు.

http://telugu.alajadi.com/wp-content/uploads/2017/06/how-to-identify-plastic-rice.

  • పిడికెడు బియ్యాన్ని ఒక గ్లాస్ నీళ్లలో వేసి స్పూను తో బాగా కలపండి. ప్లాస్టిక్ బియ్యం అయితే నీటి మీద తేలుతుంది. అదే సాధారణ బియ్యం అయితే తేలకుండా బరువు వల్ల నీటిలో మునుగుతుంది.
  • ఒక పిడికెడు బియ్యాన్ని తీస్కుని ప్లేటు లో వేసి, బియ్యానికి అగ్గి పుల్లతో నిప్పు పెట్టండి. అవి ప్లాస్టిక్ బియ్యం అయితే గనక మీకు ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది.
  • కొంచెం బియ్యాన్ని, గ్లాసెడు నీటితో కలిపి ఒక గిన్నెలో ఉడికించండి. బియ్యం ఉడికేటప్పుడు పైన తెల్లటి పొరలాగా ఏర్పడితే కనుక అది ప్లాస్టిక్ బియ్యం.
  • స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వంట నూనెని వేడి చేసి, దానిలో కొద్ది బియ్యాన్ని ఫ్రై చెయ్యండి. ప్లాస్టిక్ బియ్యం అయితే గనుక అది కరిగి గిన్నె కింద ఒక పొరలా ఏర్పడుతుంది.
  • మీరు ఉడికించిన బియ్యం రెండు రోజుల పాటు అలాగే ఉంచి పరీక్షించండి. సాధారణ బియ్యం రెండు రోజుల్లో పాడైపోతుంది. పాచి పట్టి కంపు వస్తుంది. అదే గనుక ప్లాస్టిక్ బియ్యం అయితే ఎన్ని రోజులైనా బూజు పట్టదు.

ఈ పరీక్షలు చేసిన తర్వాత మీరు వాడే బియ్యం ప్లాస్టిక్ అని తేలితే మాత్రం వెంటనే మీ డాక్టర్ ని కలిసి టెస్టులు చేయించుకోవడం మంచిది. అలాగే ఫేస్ బుక్ లో , వాట్సాప్ లో వచ్చే ప్రతిదీ నిజం కాదనీ తెలుసుకోండి. ఎలాంటి భయాలు, ఆందోళనలు పడాల్సిన పని లేదు. అనుమానం వస్తే ఈ పరీక్షలు చేయండి. లేదంటే దగ్గరి మునిసిపల్ కార్యాలయ అధికారులకు కానీ, పోలీసులకు కానీ కంప్లేంట్ ఇవ్వండి. కానీ ఈసారి బియ్యం కొనేముందు మరింత జగ్రాత్తగా ఉండండి.

(Visited 2,223 times, 1 visits today)