Home / health / ప్లాస్టిక్ చక్కర వచ్చే మార్కెట్ లోకి …ఢాం ఢాం ఢాం

ప్లాస్టిక్ చక్కర వచ్చే మార్కెట్ లోకి …ఢాం ఢాం ఢాం

Author:

అన్నం తింటున్నారా… ప్లాస్టిక్ బియ్యం ఏమో జాగ్రత్త. టీ తాగుతున్నారా అయ్యో ప్లాస్టిక్ చక్కెరేమో చూస్కోండి. మరి ఇంకేం తిందాం… పోనీ గాలి అయినా ప్రశాంతంగా పీల్చుకుందాం అంటే అది కూడా కల్తీ అయిపోయింది. తినాలంటే భయం, తాగాలంటే భయం, ఇదెక్కడి దౌర్భాగ్యం రా బాబూ అనేంతలా మారింది ప్రస్తుత పరిస్థితి. నిన్నటి దాకా అన్నంలో ప్లాస్టిక్ అన్నారు, మొన్న గుడ్లు ప్లాస్టిక్ క్యాబేజీ అన్నారు, ఇవాళ చక్కర అంటున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

plastic sugar

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ మార్కెట్ నుండి ఒక వ్యక్తి చక్కర కొనుగోలు చేసి, వాడేటప్పుడు తేడాగా అనిపించి దానిని నీళ్లలో వేసి చూసాడు అది కరగలేదు సరికదా ఆ నీళ్ళని మరిగిస్తుంటే చిన్న ఉండలు కట్టాయట. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి ఈ విషయాన్నీ ప్రజల దృష్టికి తెచ్చాడు. దీని వల్ల అందరు ఆందోళన చెందుతున్నారు. ఇలా నిత్యావసర వస్తువులన్ని ప్లాస్టిక్ మయం అయితే చాలా కష్టమనీ, ఈ విషయం ఫై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బుకి ఎగబడ్డ జనం ప్రాణాలకే ముప్పు జరిగే పనులు చేస్తుంటే, వినియోగదారుడు మాత్రం నోరెళ్ళ బెట్టి నిర్ఘాంత పోతున్నాడు. ఈ పనులకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు అధికారులని వేడుకుంటున్నారు. ఇక రానూ… రానూ.., ఇంకా ఎన్ని నిత్యావసరాలని ప్లాస్టిక్ మాయం చేస్తారో… ఊహించుకుంటుంటేనే చాల భయంగా ఉంది. ఏది ఏమైనా ప్రతి వస్తువు విషయంలో జాగ్రత్తగా ఉండండి రోజులు బాగా లేవు. తస్మాత్ జాగ్రత్త.

(Visited 296 times, 1 visits today)