ఒక్క టీజర్ తో ఫోకస్ మొత్తం తమ సినిమాపై పడేలా చేసారు అర్జున్ రెడ్డి టీమ్, లిప్ లాక్ సీన్, హీరో ఆటిట్యూడ్ సీన్ లతో సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోయింది, సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ముఖ్యంగా యువత ఎదురుచూస్తున్నారు, ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి, సినిమాలో కంటెంట్‌ని చెప్పీ, చెప్పకుండా కట్ చేస్తారు. అయితే.. ట్రైలర్లో దాదాపుగా ఓ సీన్ మొత్తం చూపించేశాడు దర్శకుడు. క్లాస్ రూమ్ లో మేడమ్‌కి అర్థం కాకుండా.. అచ్చమైన తెలుగులో మిగిలిన స్టూడెంట్స్‌కి తన లవర్ గురించి అర్జున్ రెడ్డి వార్నింగ్ ఇచ్చే సీన్ అది. సినిమా ఎంత లవబుల్‌గా ఉండబోతోందో.. ఈ సీన్ చూస్తే అర్థం అవుతుంది. ప్రేమ, అల్లరి, కోపం, విరహం, విషాదం – అర్జున్ రెడ్డి సినిమా వీటి చుట్టూనే తిరగబోతోందన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. విజయ్ దేవరకొండ తెలంగాణ యాసలో మళ్లీ అదరగొట్టేశాడు. పెళ్లి చూపులు, ఫిదాలో ప్రధాన పాత్రలన్నీ తెలంగాణ యాసలో మాట్లాడాయి. ఆసెంటిమెంట్ని అర్జున్ రెడ్డి కూడా కొనసాగించబోతున్నాడని అర్థమైంది. మొత్తానికి టీజర్ హాట్ హట్‌గా ఉంటే, ట్రైలర్ ఎమోషనల్ టచ్‌తో సాగింది. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.