Home / Latest Alajadi / Video: నేను చేసిన తప్పు.. ఇంకెవరూ చేయకూడదు – ప్రదీప్.

Video: నేను చేసిన తప్పు.. ఇంకెవరూ చేయకూడదు – ప్రదీప్.

Author:

డ్రింక్ అండ్ డ్రైవ్ లో న్యూ ఇయర్ రోజు అతిగా మద్యం సేవించి డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ స్టార్ యాంకర్ ప్రదీప్ గత రెండు రోజులుగా పోలీసుల కౌన్సిలింగ్ కి హాజరు కాకపోవడంతో ఈ విషయంని న్యూస్ చానెల్స్ సంచలనంగా మార్చేశాయి, న్యూస్ ఛానెల్స్ తో పాటు, యూట్యూబ్, సోషల్ మీడియాలలో నెగిటివ్ ప్రచారం ఎక్కువ అవడంతో ప్రదీప్ యే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

Pradeep-Video

ఆ వీడియోలో ప్రదీప్ మాట్లాడుతూ.. పోలీసుల పోలీసుల సూచనల మేరకు కౌన్సెలింగ్ కు హాజరవనున్నట్లు, తానూ ఎక్కడికి పారిపోలేదని.. ముందుగా ఫిక్స్ అయిన ముఖ్యమైన షూటింగ్స్ వల్ల కౌన్సిలింగ్ కి హాజరుకాలేదని.. డిసెంబర్ 31 న తానూ చేసింది..తప్పేనని.. అలా మరెవరు చేయకూడదని.. కొన్ని నెలల క్రితం డ్రింక్ అండ్ డ్రైవ్ వ్యతిరేకంగా మాట్లాడి వాటిని ఉల్లంఘించిన మాట వాస్తవమేనని, పోలీసుల సూచనల మేరకు న్యాయస్థాన నిబంధనల మేరకు నడుచుకుంటున్నట్లు వివరించాడు.

(Visited 359 times, 1 visits today)