పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’కి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ హైప్ కి తగ్గట్లుగానే మంగళవారం అమెరికాలో విడుదలైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీసు కలెక్షన్ తో ‘బాహుబలి ది బిగినింగ్’, ‘ఖైదీ నంబర్ 150’ రికార్డులను బ్రేక్ చేసింది. ప్రీమియర్ షోల ద్వారా దాదాపు 1.40 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
‘అజ్ఞాతవాసి’ విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దాదాపు రూ.19.50 కోట్లకు అమ్మరూ. డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం అక్కడ ప్రీమియర్ షోల కోసం రికార్డు స్థాయిలో 600 స్క్రీన్లను బుక్ చేసారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారానే దాదాపు 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి బాహుబలి ది బిగినింగ్ (1.39 మిలియన్ డాలర్లు), ఖైదీ నెంబర్ ౧౫౦ (1.29 మిలియన్ డాలర్లు), స్పైడర్ (1.05) ప్రీమియర్ షోల కలెక్షన్స్ ని దాటేసింది.
Top USA Premieres:
ALL TIME https://t.co/BHRqhrr6W7
1. #Baahubali2 Day 1 $4.6 Mn
2. #Agnyaathavaasi $1.5Mn+ pic.twitter.com/301hAot25j— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 10, 2018
ప్రీమియర్ షో కలెక్షన్స్ లలో 4.56 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ తో బాహుబలి 2 ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, ఇప్పుడు 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్ తో అజ్ఞాతవాసి సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది, అజ్ఞాతవాసి సినిమా టాక్ నెగిటివ్ గా ఉండటంతో సెకండ్ డే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఆవకాశం ఉంది, మరి అజ్ఞాతవాసి 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి ఎంటర్ అవుతుందో లేదో చూడాలి.