Home / General / ఒక్క రోజు జైలులో ఉండేందుకు రూ.2 కోట్లు..!

ఒక్క రోజు జైలులో ఉండేందుకు రూ.2 కోట్లు..!

Author:

జైలులో గడపాలని ఎవరైనా కోరుకుంటారా.. పొరపాటున ఏదైనా నేరం చేసి జైలులో ఇరుక్కుంటే జైలు నుంచి బయటికి రావడానికి ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడరు. ఒకసారి జైలుకు వెళ్లొచ్చిన తర్వాత వాళ్లని సమాజం నేరస్తుల్లాగే చూస్తుంది, మాములుగా ఏదైనా నేరం చేసి శిక్ష పడితేనే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఎలాంటి నేరం చేయకుండా జైలులో గడపాలనుకునే వారు కూడా ఈ మధ్య పెరిగిపోతున్నారు, అది కూడా ఉచితంగా కాదు అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు.

Nelson-Mandela-Jail

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఉన్న జైలులో రోజుకు రూ.500 చెల్లించి ఒక రోజు జైలు జీవితాన్ని బయటి వ్యక్తులు ఆస్వాదించే అవకాశం ఉంది, ఎలాంటి నేరం చేయకుండా ఒక్కరోజు జైలులో గడిపే ఐడియా దేశ వ్యాపంగా ఆదరణ లభిస్తుంది, ఇలానే దక్షిణాఫ్రికాలోని ఓ జైలులో కేవలం ఒక్క రోజు అవకాశం కల్పించారు అక్కడి అధికారులు కానీ ఆ ఒక్క రోజు జైలులో ఉండేందుకు చెల్లించాల్సింది అక్షరాలా రెండు కోట్ల రూపాయలు. నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా తన 27ఏళ్ల జైలు జీవితంలో 18 సంవత్సరాలు రాబెన్‌ ఐల్యాండ్‌లోని జైలులో గడిపారు. ఆ గదిలో ఒక్కరోజు ఉండేందుకు ఓ వ్యక్తి సుమారు రూ.2కోట్లు ఇవ్వనున్నాడు. జైలు నుంచి కళాశాలకు పైపులైను ఏర్పాటుకు నిధులు సమకూర్చేందుకు, దక్షిణాఫ్రికాలో నిర్భంద విద్యనందించేందుకు ఈ కార్యక్రమాన్ని స్లీప్‌ అవుట్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఛారిటీ సంస్థలకు ఆర్థికసాయం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని సంస్థ నిర్వాహకులు లియానీ మెక్‌ గొవాన్‌ తెలిపారు.

(Visited 1 times, 1 visits today)