Home / Latest Alajadi / వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?

వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?

Author:

తెలంగాణ ఎన్నికల్లో కారు ఎంత జోరుగా దూసుకెళ్ళిందో అందరికి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణశ్వీకారం చేసారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటూ…ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా తెరాస అభ్యర్థులను నిలబెట్టనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంశం వివాదంగా మారుతోంది. అనుమతి లేదంటూ ఫ్లెక్సీని హఠాత్తుగా తొలగించారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీని తొలగించడం ఏంటి అనుకుంటున్నారా.? అయితే అది తెలంగాణాలో కాదండోయి. నరసాపురం బస్టాండ్‌ వద్ద పెట్టిన ఫ్లెక్సీ.

అనుమతి లేదంటూ ఫ్లెక్సీని హఠాత్తుగా తొలగించారు. ఫ్లెక్సీ తొలగింపు సమయంలో పోలీసులు, కొందరు మునిసిపల్‌ సిబ్బంది, ఇద్దరు అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఆర్టీసీ డీఎం కూడా దగ్గరన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన ఫ్లెక్సీలను అలాగే ఉంచి ఒక్క ఈ ఫ్లెక్సీనే ఎందుకు తొలగించారని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారు నిలదీయడంతో వివాదం పెద్దదవుతోంది. అసలు ఏం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే..!

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరునాడు బుధవారం బస్టాండ్‌ సెంటర్‌లో ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు, హైదరాబాద్‌ సెటిలర్‌ అయిన సీహెచ్‌ చినరెడ్డప్ప ధవేజీ, అతని స్నేహితులు మేడిద రాము, బుడితి అనిల్‌ కలసి తెలంగాణ బాహుబలి కేసీఆర్‌కు శుభాకాంక్షలు అని స్లోగన్‌ ఇస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జనాన్ని బాగా ఆకర్షించింది. అయితే పోలీసులు వచ్చి ఎస్సై ఫ్లెక్సీ తీయించారని మేడిది రాము తెలిపారు. అయితే టౌన్‌ ఎస్సై మాత్రం ఫ్లెక్సీ మేం తీయించలేదని, మాకు సంబందం లేదని అంటున్నారు. మునిసిపల్‌ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతో ఈ అంశం వివాదంగా మారింది.

(Visited 1 times, 1 visits today)