Home / Entertainment / సింహం బోనులోకి దూకినా బ్రతికి బయటపడ్డాడు.

సింహం బోనులోకి దూకినా బ్రతికి బయటపడ్డాడు.

Author:

man_jumped_into_lion_enclosure

తీట పలురకాలు, మనుషులకు తిక్క రేగితే ఎలాంటి తీట పనులు చేస్తారో ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది. తైవాన్ కి చెందిన 46 ఏళ్ల చెన్, డ్రగ్స్ కు, మద్యపానానికి బాగా అలవాటు అయ్యీ మానసిక ఇబ్బందులతో భాదపడుతున్నాడు. ఒకరోజు బాగా తాగిన మైఖంలో తైపీ లోని జూ లో సింహాలు ఉండే ఆవరణంలోకి దూకాడు. దూకి సైలెంట్ గా ఉండకుండా తన జ్యాకెట్ ని తీసి సింహాల వైపు ఊపుతూ ” జీసస్ మిమ్మల్ని నా నుండి రక్షిస్తాడు” అంటూ అరవడం మొదలుపెట్టాడు. అతని తీట పనికి జూ కి విచ్చేసిన మిగతా సందర్శుకులకు, జూ అధికారులకు చెమటలు పట్టాయి. రెండు సింహాలలో ఒకటి మొదట చెన్ పైకి దాడి చేసి అతని జ్యాకెట్ ని లాగివేసింది. రెండో సారి అతని చెయ్యిని కొరికింది. తర్వాత చాలా కష్టం మీదా జూ అధికారులు చెన్ ని కాపాడారు. మొత్తం తతంగం ఈ వీడియో లో చూడండి.

(Visited 1,087 times, 1 visits today)