Home / Inspiring Stories / 77 ఏళ్ల వయసులో 10 వ తరగతి పరీక్షలు రాస్తున్న ముసలి బ్యాచలర్

77 ఏళ్ల వయసులో 10 వ తరగతి పరీక్షలు రాస్తున్న ముసలి బ్యాచలర్

Author:

shiv charan yadava attempting ssc exam 47th time

పదవ తరగతి పరీక్ష పాస్ అయితేనే పెళ్లి చేసుకుంటా అని శపథం పెట్టుకున్నాడు. కానీ ఆ శపథమె అతని పాలిట శాపంగా మారింది. 46 సార్లు రాసిన కూడా పదవ తరగతి పాస్ కాకపోవడంతో 47 సారికి కూడా సిద్దమవుతున్నాడు, రాజస్థాన్ కి చెందిన శివ చరన్ యాదవ్. రాజస్థాన్ లోని ఖొహరి అనే ప్రాంతంలో నివసించే శివ కి ఇప్పుడు 77 సంవత్సరాలు. అతను మొదటి సారిగా 1968 లో పదవ తరగతి పరీక్షలు రాసాడు, అప్పటినుండి రాస్తూనే ఉన్నాడు, కానీ పాస్ కాలేదు. అయిన ఏ మాత్రం బాదపడకుండా ప్రతి సంవత్సరం కొత్త ఉత్సహంతో పరీక్షలు రాస్తూనే ఉన్నాడు.

చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన శివ ను చుట్టాలు చేరదీసారు. గత 30 ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తున్న శివ ప్రభుత్వ పెన్షన్, ఇతరులు దానం చేసిన డబ్బులతో బ్రతుకుతూ ప్రతి సంవత్సరం 10 వ తరగతి పరీక్షలకు సిద్దం అవుతున్నాడట. ఈ సారి ఖచ్చితంగా పాస్ అయ్యీ, పెళ్లి చేసుకుంటా అని శివ చెబుతున్న మాటలు అతని పట్టుదలకు నిదర్శనం.

(Visited 1,115 times, 1 visits today)