Home / Entertainment / ‘అ.. ఆ..’ సినిమా రివ్యూ & రేటింగ్.

‘అ.. ఆ..’ సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

a-aa-perfect-review-rating

త్రివిక్రమ్ సినిమాలు అంటేనే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ తో, ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఉంటాయి, నితిన్,సమంత మరియు అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా త్రివిక్రమ్ ఇంతో ఇష్టపడి తీసిన సినిమా “అ..ఆ”, సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి, అసలే సర్దార్,బ్రహ్మోత్సవం సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేయడంతో త్రివిక్రమ్ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు, మీరు కూడా ఎలా ఉందో ఒక లూక్కేయండి.

కథ:

మహాలక్ష్మి (నదియా) ఓ మిలియనీర్‌, కూతురు అనసూయ (సమంత) అంటే ప్రాణం, తన ఇష్టాయిష్టాలకి అనుగుణంగా పెంచాలనుకొంటుంది. కానీ అనసూయకి మాత్రం తండ్రి రామలింగం (నరేష్‌) అంటేనే ఇష్టం. అందుకే ఆమె పేరు చివర తండ్రి పేరే ఉంటుంది. అనసూయని ఓ మిలియనీర్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని మహాలక్ష్మి ప్రయత్నిస్తుంది. కానీ అనసూయేమో వూళ్లొ ఉన్న బావ ఆనంద్‌ విహారి (నితిన్‌)ని ప్రేమిస్తుంది.

పరువే ప్రాణంగా భావించే మహాలక్ష్మి తన కూతురి ప్రేమని కాదని మిలియనీర్‌కి ఇచ్చి పెళ్లి చేసిందా? లేక.. బావ ఆనంద్‌కే ఇచ్చి పెళ్లి చేసిందా? ఆనంద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకొన్న వల్లి (అనుపమ) ఆశలు ఫలించాయా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే వెండితెరపైనే సినిమాను చూడాలి.

అలజడి విశ్లేషణ:

తెలుగు ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరొక సారి మంచి సినిమా అందించాడు అని చెప్పుకోవాలి. మంచి నటీ నటులతో సాదారణ కథను తీసుకొని అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరిని మించి మరొకరు అద్భుతంగా నటించి తమ సినిమా జీవితంలోనే మంచి నటన కనబరచారు. కామెడీ సన్నివేశాల్లోనూ మరియు భావోద్వేకర సన్నివేశాల్లోనూ చాల బాగా నటించారు అని చెప్పుకోవాలి. సహా నటులు కుడా మంచి సపోర్ట్ ఇచ్చి తమ వంతు భాద్యత నిర్వహించారు.కొత్త కథ కాకపోయినా త్రివిక్రమ్‌ తన మార్క్‌ వినోదంతో కట్టిపడేశాడు.

సమంత.. నితిన్‌ నటన….ఛాయాగ్రహణం, సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. సమంత అనసూయ పాత్రలో ఒదిగిపోయింది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్ను బాగా చూపించింది. నితిన్, ఆనంద్ విహారిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ నటుడిగా నితిన్ రేంజ్ చూపించాయి. ఇక తల్లి పాత్రలో నదియా మరోసారి తన మార్క్ చూపించింది. నరేష్, అనుపమా పరమేశ్వరన్, అనన్య, ఈశ్వరీ రావ్, ప్రవీణ్, రావు రమేష్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు మనసుని హత్తుకొనేలా ఉంటాయి.

ఇక సాధారణమైన కథ…కథలో వేగం లేకపోవడం..రొటీన్ టేకింగ్ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ సన్నివేశాలు కాస్త నిదానంగా సాగుతున్నట్టు అనిపించినా కాలక్షేపానికి మాత్రం ఢోకా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే అ..ఆ..లో పెన్ను పవర్ అంతగా కనిపించలేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడిగా త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ చూపించాడు. బరువైన ఎమోషన్స్ను తన మాటలతో ఎంతో సున్నితంగా చూపించాడు. అయితే త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే అ..ఆ..లో పెన్ను పవర్ అంతగా కనిపించలేదు. తన గత సినిమాల్లో కనిపించిన అదే తరహా సన్నివేశాలు, అవే ఎమోషన్స్ ను మరోసారి తెరమీద చూపించే ప్రయత్నం చేశాడు. నటరాజన్ సుబ్రమణియం సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా చూపించాడు. మిక్కి జె మేయర్ సంగీతం పరవాలేదు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • నితిన్,సమంతల యాక్టింగ్
  • క్లైమాక్స్
  • డైలాగ్స్.

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ కథ
  •  స్లో నేరేషన్

అలజడి రేటింగ్: 3.25/5

పంచ్ లైన్: “అ..ఆ అంటే అనుభూతి అండ్ ఆనందం.

(Visited 5,912 times, 1 visits today)