Home / Entertainment / ఫిబ్రవరి నుండి మార్చి కి వెళ్ళిన నితిన్-త్రివిక్రమ్ ల ‘అ..ఆ’.

ఫిబ్రవరి నుండి మార్చి కి వెళ్ళిన నితిన్-త్రివిక్రమ్ ల ‘అ..ఆ’.

Author:

a-aa First look

త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంచెం వెటకారం ఏ రసమైనా, సంభాషణ క్లుప్తంగా, ఆలోచన రేకెత్తించే విధంగా..మంచి మనిషి..మనవైన విలువలను తెరపై చూపెట్టే దర్శకుడు. కొంచెం చమత్కారం… ఉంటుంది. అతని కలంలో నుండి వెండితెరపైకి జాలువారిన్న అక్షరాలు థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి ఒక మంచి ఫీల్ తో బయటకి పంపేలా అతని సినిమాలు అందులో డైలాగ్స్ అలా ఉంటాయి.

మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ హీరో నితిన్ తో చేస్తున్న సినిమా ‘అ..ఆ’ ట్యాగ్ లైన్ ‘అనసూయ రామలింగం వ్/స్ ఆనంద్ విహారి’.ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఇప్పటికే 70% షూటింగ్ పూర్తిచేసుకుంది. ముందుగా ఈ చిత్ర టీం ఈ లవ్ స్టొరీ మూవీని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సినిమా పూర్తి కావడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉండడంతో ఈ చిత్ర టీం ‘అ..ఆ’ సినిమాని మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

(Visited 160 times, 1 visits today)