Home / Entertainment / టీజర్ టాక్: అ..ఆ సింపుల్ & క్యూట్.

టీజర్ టాక్: అ..ఆ సింపుల్ & క్యూట్.

Author:

A Aa Teaser

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా వస్తున్న చిత్రం అ..ఆ, ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలోనే చిత్రం ఆడియో విడుదలకు సన్నహాలు చేస్తున్నారు. కానీ దాని కంటే ముందు ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ని చూస్తుంటే చాలా క్యూట్ లవ్ స్టోరిలా ఉంది, అలాగే త్రివిక్రమ్ ఫ్యామీలి మార్క్ ఎలాగు ఉంటుంది.

ఈ టీజర్లో హీరో హీరోయిన్ పేర్లను పరిచయం చేస్తూ అలాగే చివరలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ “పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి పాతికేళ్ళూ పట్టింది” అని చూపించారు. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధ కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోని ఈ నెల చివరన విడుదల చేసి వచ్చే నెలలో ఈ చిత్రన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

Must Read: సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్స్.

(Visited 1,260 times, 1 visits today)