Home / Latest Alajadi / విధి ఆడినా వింత నాటకం లో తన ప్రియురాలిని గెలిపించిన ప్రియుడు

విధి ఆడినా వింత నాటకం లో తన ప్రియురాలిని గెలిపించిన ప్రియుడు

Author:

ఆమె పేరు హేమ. ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్, నెలకు లక్షన్నరకు పైగా జీతం. కేరళ స్వరాష్ట్రం అయినా..జాబ్ నిమిత్తం బెంగుళూర్ లో ఉంటుంది. ఓ సారి సెలవుల్లో అమెరికా వెళ్లింది. అక్కడ ఇండియాకే చెందిన ప్రజ్వల్ అనే ఓ వ్యక్తి తో పరిచయం ఏర్పడింది.. ఆది కాస్తా ప్రేమగా మారింది… కొద్దీ రోజులు చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందాం అనే ప్లానింగ్ లో ఉన్నారు వారిద్దరు. వీరి ప్రేమ పై ఎవరి కన్ను పడిందో తెలియదు కానీ దేవుడు మాత్రం ఈర్ష పడ్డట్టు ఉన్నాడు. హేమ ఓ రోజు ఆఫీస్ నుండి ఇంటికి … ఫ్రెండ్స్ తో కలిసి A/C బస్ లో బయలు దేరింది. ఇంతలోనే తను దిగాల్సిన స్టాప్ రావడంతో…దిగడానికి డోర్ దగ్గరకి వచ్చింది. ఆ స్టాప్ లో చాలామంది దిగేవాళ్లు ఉండడంతో వారు దిగాక దిగుదామని వెయిట్ చేస్తూ …. లైన్లో చివరగ ఉండిపోయింది …. అందరూ దిగారు అనుకొని బస్ డ్రైవర్ ఆటోమేటిక్ డోర్ ను క్లోజ్ చేసి బస్ ను ముందుకు కదిలించాడు.

ఈ సమయంలో బస్ నుండి కిందికి దిగబోతున్న హేమ బట్టలు బస్ డోర్ లో తట్టుకొని హేమ కిందపడిపోయింది. క్షణ కాలంలో బస్ వెనుక టైర్ ఆమె ఎడమ మోకాలు మీదుగా పోయింది. రక్తం ధారలుగా కారుతోంది. హేమ సృహ తప్పుతోంది….. అక్కడ గుమ్మి గూడిన వారి మాటలు అస్ఫష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడే ఉన్న కొంత మంది హేమను హాస్పిటల్ లో చేర్పించి, ఆమె తల్లీదండ్రులకు సమాచారాన్ని అందించారు.

ఆపరేషన్ నిమిత్తం మత్తు మందు ఇచ్చారు. హేమ సృహలోకి వచ్చేసరికి ఎదురుగా ఆమె తమ్ముడు కనిపించాడు…అటు పక్కనే ఆమె అమ్మానాన్న లు ఏడుస్తూ కనిపించారు. నొప్పిగా అనిపించిన కాలు వైపుకు చూసేసరికి సగం కాలు లేదు. మోకాలి దగ్గర కట్టుకట్టిఉంది. ఏడుస్తున్న అమ్మను ఉద్దేశించి కాలు పోతే పోయింది నేను ఉన్నాకదమ్మా..అంటూ వాళ్లకే ధైర్యాన్నిచ్చింది హేమ.ఈ విషయం తెలుసుకున్న హేమ బాయ్ ఫ్రెండ్…ఇండియాకు వచ్చాడు. డైరెక్ట్ హాస్సిటల్ కు చేరుకున్నాడు. హేమ మనస్సులో డౌట్…ఈ పరిస్థితుల్లో ఉన్న తనను చూసి ప్రజ్వల్ పెళ్లిని వద్దనుకుంటాడు..తనతో ఉన్న రిలేషన్ షిప్ ను కూడా వదులుకుంటాడు..అయినా నేను కూడా ఫోర్స్ చేయొద్దు ఎందుకంటే…ప్రస్తుత పరిస్థితి అది అనుకుంది.

కానీ….ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ హేమను చూడడానికి వచ్చిన ప్రజ్వల్ …అందరి ముందు హాస్పిటల్ లో హేమకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అనుకున్న విధంగానే హేమ కోలుకున్నాక ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన ఏడాదిన్నరలో హేమ గర్బావతి అయ్యింది. ఓ కాలు లేదు…పైగా ప్రెగ్నెన్సీ…ఇదంతా పుట్టబోయే పిల్లాడిపై ఎలాంటి భారం పడుతుందో నని ఒకటే టెంక్షన్…. హేమకు పండంటి పిల్లాడు పూర్తి ఆరోగ్యంతో పుట్టాడు. వాడు ఎంత యాక్టివ్ అంటే పుట్టిన 20 నెలలకే జనగణమన అధినాయక జయహే అనే జాతీయగీతాన్ని కంఠస్తంగా పాడేస్తాడు.

ఇప్పుడు హేమ మళ్లీ తన జాబ్ లో జాయిన్ అయ్యింది. వారి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఈ మొత్తం 3 సంవత్సరాల కాలంలో ప్రజ్వల్ హేమకు అన్నివిధాలుగా అండగా ఉండి..రియల్ హీరో అనిపించుకున్నాడు…..!!

Source : Soical Media

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)