Home / Inspiring Stories / 70మంది పసివాల్ల ని ఆదుకుంటున్న చాయ్ వాలా.

70మంది పసివాల్ల ని ఆదుకుంటున్న చాయ్ వాలా.

Author:

ఈయన పేరు ప్రకాష్ 70 మంది పేద పిల్లల కోసం పిల్లల కోసం ఒక ఉచిత స్కూల్ నడుపుతున్నాడు. పౌష్టికాహార లోపం వల్లే పిల్లలలో శక్తీ,చదువుకునే ఆసక్తీ తగ్గుతున్నాయని రోజూ వారికోసం ఉచితంగా పాలు కూడా ఇస్తాడు.. ఆ..! డబ్బుంటే మేమూ చేస్తాం ఇలాంటి పనులు,ఇంతకీ ఎన్నికోట్ల బ్లాక్ మనీ వైట్ చేసుకోవటానికీ పనులూ అంటారా…? ప్రకాష్ నడిపే కంపెనీ ఏమిటో తెలుసా..!? ఒక టీ స్టాల్ కోటక్ పట్టణం లోని ఒక సెంటర్ లో నడిపే టీస్టాల్ మాత్రమే అతని జీవనోపాది అందులో మిగిల్చిన కొద్దిపాటి డబ్బులతోనే ఇవన్నీ చేస్తున్నాడితను. అంతే కాదు మన రీసెంట్ సినిమా శ్రీమంతుడు లాగా “సమాజం మనకెంతో ఇచ్చింది ఎంతోకొంత మనమూ తిరిగివ్వాలి కదా” అంటాడితను.

a chaiwalla who is changing lives of 70 underprivileged children

ఇప్పటివరకూ 205 సార్లు రక్తదానం చేసాడు కూడా…. తన భార్యా పిల్లల సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నాను అనే ప్రకాశ్ చిన్న తనం లో వాళ్ళ నాన్న నడిపే టీస్టాల్ లోనే చదువుకునే ప్రయత్నం చేస్తే “పని చేస్తేనే కడుపు నిండుతుంది ఈ చదువులవల్ల ఏం ఒరగదు” అంటూ చదువుమాంపించటం వల్లే తాను చదువుకోలేకపొయాడు ఆ భాద తగ్గించుకోవటానికే తన పిల్లలని పెద్ద చదువులు చదివిస్తున్నాడు….. ఇంకా అతని గురించి తెలుసు కోవాలనిపిస్తే ఈ వీడియో చూడండి….

(Visited 601 times, 1 visits today)