Home / Inspiring Stories / ఆమె కోసం బతికాడు ఆమెని బ్రతికించాలనుకున్నాడు..

ఆమె కోసం బతికాడు ఆమెని బ్రతికించాలనుకున్నాడు..

Author:

Sunny Pawar and Aarthi True Love Story

 

ప్రేమ…! ఈ ఒక్క మాట, ఈ ఒక్క ఫీలింగ్…. ఇన్ని లక్షల సంవత్సరాలుగా మనిషి అనేవాడు మనిషిగా నే ఉండేందు కారణమైన ఒకే ఒక కారణమేమో.. ఏవో కారణాలతో మనిషిని ఇష్టపడతాం మరేవో కారణాలతో దూరమైపోతాం.ప్రేమలో,ప్రేమించటం లో మనం ఓడిపోయి “ప్రేమ విఫలమయ్యిందని” అనేస్తాం. అయినా మళ్ళీ మరో మనిషి ప్రేమకోసం వెతుకూనే ఉంటాం… స్నేహితుడు,అమ్మా,దగ్గరగా వచ్చిన మరో స్త్రీ ఇలా ఎవరో ఒకరు మనకు ప్రేమని ఇస్తూనే ఉంటారు మననుంచీ దాన్ని పొందుతూనే ఉంటారు.ఎవరూ ఎవరినీ విడిపోరు… ప్రేమ విడిచి వెళ్ళనివ్వదు ప్రేమించే మనిషి మారొచ్చు ప్రేమ మారదు అది నిరంతర ప్రవాహం.ఈ చీన లాజిక్ అర్థమైతే ఎక్కడా మరో దేవదాసు పుట్టడు… ఏ ఆడపిల్ల మొకం మీదా యాసిడ్ చిందదు. అద్బుతమైన ప్రేమికులు ఎక్కడో కథల్లోనో సినిమాల్లోనో మాత్రమే ఉండరు. మనచుట్టూ ఉంటారు కొన్ని సార్లు అది మనమే కావొచ్చుకూడా… సన్నీ పవార్ లా.. ఎవరీ సన్నీ పవార్? అంటే….

 

 

28 సంవత్సరాల కుర్రాడు 15 నెలల ప్రేమ కోసం తను ప్రేమించిన అమ్మాయి ని మరణం వరకూ కంటికి రెప్పలా చూసుకున్న వాడు. ముంబై లోని ఒక సమ్మర్ క్యాంప్ లో కలుసుకున్న ఆర్తి ని చూసి ఇష్ట పడ్డాడు ఆమెతో తన ప్రేమ విషయాని చెప్పేసాడు కూడా చదువులైపోగానే పెళ్ళి అనుకున్నారు. ఇళ్ళలో చెప్పేసారు కూడా. ఐతే ఒక సంవత్సరం లోనే వారి కలలు కూలిపోయాయ్. ఆర్తి ఒక కార్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడింది గాయపడింది కోమాలోకి వెళ్లిపోయింది. బతకటం కూడా కష్టం అయిన సమయం లో అతి ప్రయత్నం మీద బతికింది ఆర్తి. తన కంటూ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా బతకాలనుకున్న ఆమె ఇంకొకరి సాయం లేకుండా కనీసం చూపు కూడా తిప్పలేని పరిస్థితి. సన్నీ ఆమెని వదిలిపోలేదు కొద్ది రోజులు ఏడ్చి మరొకరిని వెతుక్కోలేదు. రోజంతా ఆర్తి పక్కనే ఉండే వాడు తన చదువుని వదిలేసి రోజులో పన్నెండు గంటల పాటు ఆర్తి తో మాట్లాడుతూ ఆమెకి పాలు తాగిస్తూ ఉండేవాడు… ఆర్తి పాలు తప్ప ఏమీ తాగలేదు అదీ ఒక కప్పు పాలు తాగాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. ” ఆమెతో జీవితమంతా ఉంటానన్నాను మధ్యలో వెళ్ళిపోవటం అనే ఆలోచనే రాలేదు నాకు ఆమెతో ఆక్సిడెంట్ కి ముందు 15 నెలలు కలిసి ఉన్నాను,ఆక్సిడెంట్ తర్వాతా ఉన్నాను ఆమెను ఏరోజుకైనా మళ్ళీ మామూలుగా చూస్తాను” అనే వాడు. రోజూ ఆర్తి తో మాట్లాడటం ఆమె కోసం ఇన్స్పిరెషనల్ వాక్యాలూ,కవితలూ రాసి కనిపించేలా గోడపై ఉంచటం ఇలా అన్నీ చెస్తూనే తానూ మళ్ళీ కాలేజ్ లో చేరాడు సాయంత్రాలు.

“నేను నా కూతురికి తల్లినే అయినా ఆక్సిడెంట్ తర్వాత ఆర్తికి అతనే తల్లీ, తండ్రీ, సోదరుడూ, బాయ్ ఫ్రెండూ అన్నీ తనే” అంటూ చెప్పింది ఆర్తి తల్లి. అలా ఆర్తిని నాలుగేళ్ళ పాటు కంటికి రెప్పలా కాపాడు కున్నాడు. ఆర్తీ కోలుకుంది కొద్దికొద్దిగా ఫిజియో తెరపీకీ రెస్పాండవటమూ మొదలు పెట్టింది. 2010 జూన్ 13 న ఆర్తి జ్వరం వచ్చింది నెమ్మదిగా పెరగటం మొదలుపెట్టింది జూన్ 15 న పరీక్షల్లో అది న్యుమోనియా అని నిర్ధారణ జరిగింది. అదే రాత్రి 8.30 ఆమె తన చివరి శ్వాస పీల్చుకున్నప్పుడే సన్నీ కంటినుంచి మొదటి కన్నీటి చుక్క బయటికి వచ్చింది… ఆర్తి చనిపోయింది… “ఆమె తనెప్పుడూ ఎవరి మీదా ఆధార పడకుండా బతకాలనుకుంది, ఆఖరికి నామీద కూడా” అంటూ ఏడుస్తూనే ఉన్నాడు…

(Visited 243 times, 1 visits today)