Home / Inspiring Stories / ఈ శివాలయంలో పూజారి పేరు మహమ్మద్ జహీర్.

ఈ శివాలయంలో పూజారి పేరు మహమ్మద్ జహీర్.

Author:

Mohammed_Zahir

శ్రావణ మాసం మహారుద్రుడైన శివున్ని పూజించే హిందువులకు పవిత్రమాసం ఆ నెలంతా శివాలయాలు హరనామ స్మరణతో హోరెత్తిపోతాయి. అయితే ఇండోర్ లోని ఖాండ్వా లో ఉండే ఈ మొహమ్మద్ జహీర్ అనే వృద్దునికి శ్రావణం అనేది మామూలుగా ఒక నెల మాత్రమే ఎందుకంటే అతనికి సంవత్సరం అంతా శ్రావణమే ప్రతీ రోజూ శివసాన్నిధ్యమే అతనికి తాను రోజూ ప్రార్థన చేసుకునే దర్గా ముఖ్యమో ఈ శివాలయమూ అంతే….అతను ఆ గుడి కి కేర్ టేకర్ ఆ పరమ శివునికి కూడా…

నిజానికి ఇతను ఖాండ్వా వాసి కాడు అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని భురహాన్ పూర్ ఇతని స్వగ్రామం. భారత పురాతత్వ శాఖ (ఆర్కెయాలజీ సర్వే ఆఫ్ ఇండియా) లో వచ్చే ఈ చారిత్రక ఆలయ కేర్ టేకర్ గా తనకు ఉధ్యోగం వచ్చినప్పుడు అతను సంతోషంగా చేరిపోయాడు. ఆరేళ్ళుగా ఈ ఆలయానికి తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.మొదట తనను ఈ ఆలయ కేర్ టేకర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చినప్పుడు ఇది దేవుడే నాకు చూపించిన ఉపాది దాన్ని ఎలా కాదనగలను అనుకున్నాడట. అలా ఒక ఉద్యోగంగా ఆలయాన్ని చూసుకోవటం మొదలు పెట్టిన అతను ఆ పరిసరాలతో ఆ శివుని తోనూ అనుబందాన్ని పెంచుకున్నాడు…

Allah God Bhagwan All are One1

ఆ ఆలయంలో పూజలు చేసేందుకు ఏ పూజారీ లేడు వచ్చే భక్తులకూ టూరిస్టులకూ పూజ చేయటంలో సాయం చేసేది ఈ నలభయ్యేళ్ళ సాయిబు పూజారే. పువ్వులతో శివున్ని అలంకరించటం జ్యోతులను వెలిగించటం వంటి పనులన్నీ తనే చేస్తూంటాడీ. నిజమైన దైవారాధకుడు. ఇంకో విషయం ఏమిటంటే అదే గుడికి 100 మీటర్ల దూరం లో ఉన్న పురాతత్వ శాఖ పరిదిలోనే ఉన్న దర్గానీ ఇతనే చూసుకుంటాడు. రెండు మతాలకూ తానే ఒక వారధిలా కనిపిస్తాడు.తన ఐదుగురు పిల్లలకూ అతను ఈ రెండు ప్రార్థనాలయాల నూ సమానంగా చూసుకొమ్మనే చెబుతున్నాడు… అదే పద్దతిలో పెంచుతున్నాడు కూడా..

Mohammad Jahir

దేవుడు అనేది మనలోనే ఉండి మనలని మనం అంటే మనుషులని మనుషులే ఎలా పూజించుకోవాలో,ఎలా గౌరవించుకోవాలో చెప్పే ఒక సిద్దాంతి లాంటి వాడు. ఆయన ఇక్కడ ఒక లాగా అక్కడ ఒక లాగా రూపాలు మరి మనకు కనిపించవచ్చు కనీ ఆయన చెప్పే విషయాన్ని మార్చడు. రూపాలు మారినంత మాత్రాన దేవుడు మారిపోతాడా అక్కడా ఇక్కడా ఆయనే ఉన్నాడు అని చెబుతూనే… ఆలయాన్ని శుభ్రపరిచే ఈ జహీర్….. నిజానికి ఒక భారతీయ తత్వాన్ని మళ్ళీ ఒక సారి మనకు చెప్పినట్టు లేదు…

(Visited 1,590 times, 1 visits today)