Home / Entertainment / భవిష్యత్తులో అబ్ రామ్-ఆరాధ్య ఎవర్ గ్రీన్ జంట – షారుఖ్ ఖాన్

భవిష్యత్తులో అబ్ రామ్-ఆరాధ్య ఎవర్ గ్రీన్ జంట – షారుఖ్ ఖాన్

Author:

srk-abram-amitabh-aaradhya

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ జంటలు ఎవరంటే నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేర్లు అమితాబ్-రేఖ, షారుఖ్ ఖాన్ – కాజోల్ అని.. అయితే ఇటీవల ‘దిల్ వాలే’ చిత్ర ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఒకాప్పుడు అమితాబ్-రేఖ గారు, ప్రస్తుతం నేను కాజోల్ బెస్ట్ అని భవిష్యత్తులో తన కుమారుడు అబ్ రామ్ – ఐశ్వర్యల ముద్దుల కూతురు ఆరాధ్యలు తెరమీద మంచి జంట అవుతారని షారుఖ్ కామెంట్స్ చేసాడు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఆరాధ్యకి ఉంది.

షారుఖ్ చేసిన కామెంట్స్ తనకు చాలా సంతోషాన్నిచ్చాయని అమితాబ్ తెలిపాడు. షారుఖ్ చేసిన ఆ కామెంట్స్ కి అతని నోరు తీపి చేయాలనీ ఉందని అమితాబ్ ఇటీవల జరిగిన ‘వాజీర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తెలిపాడు. అంటే ఇప్పటి నుండే ఈ బచ్చన్ ఫ్యామిలీకి తమ గారాల పట్టిని బాలీవుడ్ హీరోయిన్ గా చేయాలనే మనసులోని కోరిక షారుఖ్ కామెంట్స్ ద్వారా బయటపడింది. ఇక షారుఖ్ కుమారుడు అబ్ రామ్ వయస్సు 2 సంవత్సరాలు అయితే అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య వయస్సు 4 సంవత్సరాలు అవడం విశేషం.

(Visited 164 times, 1 visits today)