ఇరాన్లో రూపొందించిన ఓ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో ‘ప్రొఫెట్ మహమ్మద్’ జీవిత కథ ఆధారంగా మూడు భాగాలుగా ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి భాగంగా
‘ప్రొఫెట్ మహమ్మద్- ది మెసెంజర్ ఆఫ్ గాడ్’ ఎన్నో విమర్శలను ఎదుర్కొని విడులైంది. ఇరానీయన్ దర్శకుడు మాజీద్ మజిదీ దర్శకత్వంలో విడుదలైన మొహమ్మద్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వివాదాస్పద చిత్రానికి సంగీతం అందించినందుకు గాను ముంబై కేంద్రంగా ఉన్న ఓ సున్నీ ముస్లిం సంస్థ అయిన “సున్ని ముస్లిం గ్రూప్ రజా అకాడమీ” రెహమాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది.
ఏఆర్ రెహమాన్ మీద మాత్రమే కాదు. ఈ సినిమా దర్శకుడు ప్రముఖ ఇరానియన్ ఫిల్మ్ మేకర్ అయిన మాజిద్ మాజిదికు వ్యతిరేకంగా కూడా ఫత్వా జారీ అయింది. సినిమాలో ప్రొఫెట్ మహ్మద్‌కు సంబంధించిన ఎలాంటి పదం కానీ, విజువల్స్ కానీ ఉపయోగించరాదని సున్ని ముస్లిం గ్రూపు డిమాండ్ చేసింది పుట్టింది మతంలోనే అయినా ఈ దిలీప్ కుమార్ తర్వాత చిన్న తనంలో తండ్రి చనిపోయి చేతిలో డబ్బులు లేక కష్టాలు అనుభవిస్తున్న సమయంలో సూఫీ మతగురువు పీర్ కరిముల్లా షా ఖాద్రి బోధనలతో ఉపశమనం పొందాననీ చెప్పిన రెహమాన్ సూఫీ మతం లోకి మారి తన పేరును అల్లా రఖా రెహమాన్‌గా మార్చుకున్నాడు. మన సంగీత దిగ్గజం ఏఆర్.రెహమాన్. రెహ్మాన్ అసలు పేరు ఎ. ఎస్. దిలీప్ కుమార్. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు. అసలే పేద కుటుంబం. తండ్రి శేఖర్ మరణంతో వారి కుటుంబం కష్టాల పాలైంది. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది. తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో సినీ రంగం లో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ సినిమా మొదట విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ తొలి చిత్రం ఇదే అనుకోవాలి. ‘రోజా’ సినిమా భారీ విజయం సాధించడం, ముఖ్యంగా మ్యూజికల్ హిట్ కూడా కావడంతో రెహహాన్ పాపులర్ అండ్ బిజీ సంగీత దర్శకుడయ్యాడు. “స్లమ్‌డాగ్ మిలియనీర్” అనే చిత్రంలో ‘జై హో’ అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన “ఆస్కార్”ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్.ఇప్పుడు అంతర్జాతీయ సంగీత దర్శకుడు కూడా అయిన రెహమాన్ ఇంకా ఈ ఫత్వా విషయం పై మౌనంగానే ఉన్నారు.