Home / Inspiring Stories / ఆ “కళ్ళు” ఇక తెరుచుకోవు.

ఆ “కళ్ళు” ఇక తెరుచుకోవు.

Author:

Kallu Chidambaram Passes away died

కళ్ళు చిదంబరం ఇక లేరు కొంతకాలం గా అనారోగ్యం తో బాదపడ్తూ కేర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన కొద్ది సేపటి క్రితమే తుదు శ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్ళు’ నాటకం ఆధారంగా  ఎం.వి.రఘు దర్శకత్వం లో వచ్చిన కళ్ళు చిత్రం ద్వారా నాటక రంగం లోనుంచి వచ్చిన చిదంబరం. తన వింత డైలాగ్ డెలివరీ తో పాటు తనకున్న శారీరక లోపాన్ని కూడా ప్రేక్షకులని నవ్వించటానికి వాడుకున్నారు.నిజానికి ఆయన కన్ను పుట్టుకతో వచ్చిన లోపం కాదు. నాటక రంగంలో
ఉన్నప్పుడు విపరీతమైన శ్రమ వళ్ళ,బిజీగా ఉండటం వళ్ళ చిన్న గా ఉన్నప్పుడే ఆ సమస్యని పట్టించుకోకుండా పూర్తిగా కళలోనే లీనమైపోవటం వల్ల ఒక కంటి నరం దెబ్బతిని పక్కకు లాగేయడంతో 36వ ఏట వరకు సాధారణంగా ఉన్న అతని కన్ను పూర్తిగా మెల్లకన్నుగా మారిపోయింది.

కొళ్ళూరు చిదంబరం మొదటి సినిమా పేరుని తగిలించుకోని కళ్ళు చిదంబరం అయ్యారు. ఈ సినిమాకు గానూ ఈయనకి నంది అవార్డ్ కూడా వచ్చింది. మొత్తం 300 చిత్రాలలో నటించిన చిదంబరం. అమ్మోరు, కొన్ని సినిమాల్లో తన కళ్ళతోనే ప్రేక్షకుల్ని భయపెట్టాడు. ‘అమ్మోరు’ సినిమాలో కళ్ళు చిదంబరం పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.రాం గోపాల్ వర్మ “గోవిందా గోవిందా” లోనూ కొద్ది సేపు ఒక సీరియస్ లుక్ తో కనిపిస్తారు చిదంబరం. విశాఖ పోర్ట్‌లో ఉద్యోగం చేస్తూ, స్వచ్ఛంద విరమణ తీసుకున్న అనంతరం కళ్ళు చిదంబరం నాటక రంగంపై ఆసక్తితో అటువైపు మళ్ళారు. అట్నుంచి అటే కళ్ళు చిదంబరం సినిమాల్లోకి అడుగు పెట్టారు. గత కొంతకాలంగా ఆయన సినిమాలకూ దూరంగా వుంటున్నారు.. అది కూడా అనారోగ్యం కారణంగానే.

చిదంబరం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు,ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతినీ తెలియ జేసారు.

(Visited 66 times, 1 visits today)