Home / Inspiring Stories / ఆ పాప తల తీసేస్తారా??

ఆ పాప తల తీసేస్తారా??

Author:

A Bangladeshi baby girl born with two heads.

ఒక్కోసారి నమ్మలేమనిపించే సంఘటనలు జరగటం వింటూనే ఉంటాం. నాలుగు కాళ్ల శిశువూ,పుట్టిన వెంటనే మాట్లాడిన బాలుడుడూ లాంటి  వార్తలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అలాంటి సంఘటనే మరొకటి జరిగింది ఐతే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ పాప 36 గంటల తరవాత కూడా ఆరోగ్యంగానే ఉంది. వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరానికి వంద కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మంబారియాలో ఓ ఆస్పత్రిలో ఓ శిశువు రెండు తలలతో జన్మించింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక కాన్పు కష్టంగా మారిన ఓ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఈ రెండు తలల పసిగుడ్డును బయటికి తీశారు. ఐతే పుట్టిన బిడ్దకి రెండుతలలుండటం చూసి కొద్దిగా షాక్ తిన్న వైధ్యులు తేరుకొని రెండు తలలోని శ్వాశమార్గాలనూ శుబ్రం చేసి ప్రత్యేక విభాగం లోకి తరలించారు. రెండు తలలూ పూర్తిగా ఎదిగి ఉండటమూ, మరే రకమైన ఆరోగ్య సమస్యలూ ఆ పాపకు ఎదురవలేదు.

ఈ అసాధారణ వింత ఘటన గురించి స్థానికంగానే కాదు చుట్టుపక్కలకూ పాకడంతో పాపను చూడడానికి జనం వెల్లువలా వస్తున్నారు. వేలకొద్దీ జనం ఆసుపత్రికి వచ్చి ఈ వింతను చూసివెళుతున్నారు. తలలను మినహాయిస్తే మిగతా అవయవాలన్నీ మిగతా బిడ్డల్లాగే సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఐతే ఆ పాపకి భవిశ్యత్తులో వచ్చే సమస్యల దృస్ట్యా ఆ అదనపు తలను తోలగించాలా వద్దా అనేది ఇప్పూడే నిర్ణయించుకోలేదనీ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. తలలు రెండూ పూర్తిస్థాయిలో ఎదిగాయని, తను చూసిన సమయంలో రెండు ముక్కులతో శ్వాస పీల్చుకుంటోందని పాప తండ్రి జమాల్‌ మియా వివరించారు. అసాధారణంగా జన్మించినా పాప, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉండడం తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.

(Visited 100 times, 1 visits today)