Home / Entertainment / బెంగాల్ టైగర్ తో బ్రిటిష్ బ్యూటి అమీ జాక్సన్ ?

బెంగాల్ టైగర్ తో బ్రిటిష్ బ్యూటి అమీ జాక్సన్ ?

Author:

Amy Jackson in Ravi Teja Movie

కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న రవితేజకు ‘బెంగాల్ టైగర్’ ఆ లోటు తీర్చింది. దాంతో ఆయన తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టాడు.ఈ సినిమా రిలీజ్ కి ముందే రవితేజ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో మొదటిది సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేసే సినిమా అయితే, రెండవది దిల్ రాజు – వేణు శ్రీరాం కాంబినేషన్ లో రానున్న ‘ఎవడో ఒకడు’. ఈ రెండు కాకుండా రీసెంట్ గా చక్రి అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ ఓ సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

రవితేజ – కొత్త దర్శకుడు చక్రి కాంబినేషన్ లో రానున్న సినిమాలో హాట్ బ్యూటీ అయిన అమీ జాక్సన్ ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీం అమీ జాక్సన్ ని అప్రోచ్ అయ్యారు. తనకి కథ నచ్చింది కానీ ప్రస్తుతం అమీ కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి, వీరు అడిగే డేట్స్ కి తన కాల్షీట్స్ అడ్జస్ట్ చేయగలమా లేదా అనే సందిగ్దంలో ఉంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే అమీ జాక్సన్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. రవితేజ కమిట్ అయి ఉన్న సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి డేట్స్ అరేంజ్ చేయాల్సి ఉంది. తెలుగులో ‘ఎవడు’ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించిన అమీ జాక్సన్ ప్రస్తుతం ‘రోబో 2.0’లో నటిస్తోంది. ఎక్కువ భాగం వచ్చే ఏడాది మొదటిలోనే ఈ సినిమా మొదలవుతుంది.

(Visited 155 times, 1 visits today)