Home / Political / ఎమ్మెల్యే సోనీ సూరీ పై యాసిడ్ దాడి చేసిందెవరు?

ఎమ్మెల్యే సోనీ సూరీ పై యాసిడ్ దాడి చేసిందెవరు?

Author:

AAP MLA Sonu Soori attacked with Acid

ఆదివాసీ మహిళాహక్కుల ఉద్యమ కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోనీ సూరీ పైన గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌ లాంటి రసాయనంతో శనివారం రాత్రి దాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సోనీ సూరీ తన మిత్రులతో కలిసి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పైన వచ్చారు. సోనీ కారును అడ్డుకున్నారు. కిందకు దిగాలని బెదిరించారు. సోనీ సూరీ కారు నుంచి బయటికి రాగానే ఆవిడపై యాసిడ్‌ లాంటి ద్రావణాన్ని పోసి పరారయ్యారు. సహచరులు సోనీని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముఖం నల్లగా మారిందని అయితే అది యాసిడ్‌ లాంటి ఓ రసాయన పదార్థమని వైద్యులు తేల్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు

గతంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చిత్రహింసలు అనుభవించిన మహిళ ఆమె. అయితే ఇక్కడొక మలుపుంది విచిత్రమేమిటంటే ఆమె తండ్రి పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడని నక్సల్స్ అతనిపై దాడిచేస్తే, ఈమె మాత్రం మావోయిస్ట్ పార్టికి సహకరిస్తుందని ఆరోపించబడటం…! ఆమె చేసిన నేరమంతా ఒక ఆదివాసి మహిళగా, హక్కుల కార్యకర్తగా వారి హక్కులకోసం పోరాడటమే…!
ఒకటీ రెండూ కాదు ఎన్నో నిరాధార ఆరోపణలు మోపారు స్ధానిక కాంగ్రెస్ నాయకుడి పైన దాడి చేసిందని, పేలుడు పదార్ధాలతో ఎస్సార్ స్టీల్ కంపెనీ వాహనాలు పేల్చివేసిందని, ఎస్సార్ స్టీల్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసి అన్నల కోసం తీసుకెళ్తుండగా అరెస్టు చేశామనీ, పోలీసుల పైన కూడా కాల్పులు జరిపిందనీ… ఇలా ఎనిమిది అక్రమ కేసులను ఒక నిస్సహాయ భారతీయ ఆదివాసీ మహిళపైన పోలీసులు పలు కేసులు బనాయించారు. ఆమెతో పాటు కొడీపి అనే జర్నలిస్ట్ (ఆమె దగ్గరి బందువు)ను కూడా మావోయిస్టులకు సంబందాలు ఉన్నాయని అరోపించి అరెస్ట్ చేసారు. అప్పట్లో.

AAP MLA attacked with Acid

“నక్సల్స్, ప్రభుత్వాల మధ్య ఘర్షణల్లో నేను సర్వస్వం కోల్పోయాను. నక్సల్స్ మా తండ్రిని హింసపెడుతుంటే, నన్ను నక్సల్ సానుభూతిపరురాలిగా ముద్ర వేశారు, నేనొక్కటే కోరుతున్నాను. దయచేసి నన్నింక హింసించవద్దు. ఎందుకంటే హింసను భరించే శక్తి నాకిక లేదు. నేను నిజం చెప్పినప్పుడల్లా, నిజం రాసినప్పుడల్లా నన్ను శిక్షిస్తున్నారు. భవిష్యత్తులో అది మళ్ళీ జరగకూడదు.” అని ఆమె మీడియా ముందు వాపోయారు కూడా..

అమ్నెస్టీ, మహిళా, ఆదివాసి, హక్కుల సంఘాలు అందోళనలు, ఒత్తిడి ఫలితంగా బెయిల్ మీద విడుదలైన సోని సూరీ అనంతరం కేజ్రివాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసింది ఎమ్మెల్యే అయ్యింది కూడా..! అయితే ఇప్పటికి కూడా ఆమె మీద జరిగే దాడులకు అడ్డుకట్ట పడలేదు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పై దాడి అదీ పాలక వర్గం మీదే అనుమానం కలిగే లా జరగటం గమనార్హం…

(Visited 104 times, 1 visits today)