Home / Reviews / ఆటాడుకుందాం రా రివ్యూ & రేటింగ్.

ఆటాడుకుందాం రా రివ్యూ & రేటింగ్.

Author:

Aatadukundamraa-Movie-Review

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరో సుశాంత్. తన ఆరు సంవత్సరాల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేసింది కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి మూడు సినిమాలు మాత్రమే. చాలా రోజుల తర్వాత మన ముందుకు ఇప్పుడు ఆటాడుకుందాం రా అంటూ వస్తున్నాడు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ దర్శకుడిగా పేరుపొందిన నాగేశ్వరరెడ్డి ఈ సినిమాలో సుశాంత్ తో ఏ విధంగా ఆటాడించాడో ఒక్కసారి చూద్దాం…

కథ :

ఇద్దరు ప్రాణ మిత్రులైన విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) లను చూసి అందరూ చాలా జెలసీగా ఫీల్ అవుతుంటారు. స్నేహిడైన ఆనంద్ స‌ల‌హాల‌తో విజ‌య్‌రామ్ బిసినెస్ చేసి కోట్లు సంపాదిస్తాడు. అలా ఇద్దరు కలసి ఉండటం చూసి తట్టుకోలేని విజయరామ్ ప్ర‌త్య‌ర్థి అయిన శాంతారామ్, విజయరామ్ నీ దొంగ  దెబ్బ తీసి ఆ నేరాన్ని ఆనంద్ ప్రసాద్ మీదికి నెట్టుతాడు. దానితో ఆ ఇద్దరు విడిపోతారు.

20 సంవత్సరాల తర్వాత విజయరామ్ చాలా కష్టాలలో ఉన్న సమయంలో తనకు మేనల్లుడు అయినా సుశాంత్ అమెరికా నుండి వస్తాడు. అసలే చెల్లి అంటే పడని విజయరామ్ సుశాంత్ నీ దగ్గరకు రానిచ్చాడా ! మామ కష్టాలు అల్లుడు తీర్చాడా! మధ్యలో సుశాంత్ ల‌వ‌ర్ శృతి వలన కలిగిన నష్టాలు ఏమిటి? లాభాలు ఏమిటి! ఇంతకు టైం మిషన్ దగ్గరకు ఎందుకు వెళ్లారు అనేది కథ .

అలజడి విశ్లేషణ:

చాలా రోజుల తర్వాత  సినిమా చేసిన సుశాంత్ తన బాడీ నీ మార్చుకొని ఇదివరకటి సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. అలాగే నటన పరంగా కూడ పరవలేదు అనిపించాడు. డ్యాన్సలలో ఫైట్స్ లలో మంచి ఈజ్ చూపించాడు. ఇద్దరి స్నేహితుల కథ చాలా సినిమాలలో వచ్చింది. ఇక ఎవరైతే మోసగాడు అంటూ ఇన్ని 20 సంవత్సరాలు నింద మోస్తుంటాడో అతని కొడుకే తండ్రి మీద పడ్డ మచ్చను చెరిపేయడానికి తిరిగి ఆ తండ్రి స్నేహితుడి దగ్గరే చేరి, ఈ ఇద్దరు స్నేహితులను విడగొట్టినవారిని ఎలా ఆడుకుంటాడు అనేది కథ.ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కథ భాగాలేనప్పుడు కథనంపై దృష్టిపెట్టాలి దర్శకుడు కానీ అలా చెయ్యలేదు. సినిమా మొత్తాన్ని 2 సినిమాలుగా తీశారు. మొదటి భాగం  మొత్తం కలిసుందాం రా టైపు ఫామిలీ ఎమోషన్, కామెడీ ట్రై చేశారు..ఇక రెండవ భాగం  బాద్షా డ్రీం మెషిన్ ఎపిసోడ్ ని టైం మెషిన్ గా చేసి నడిపించేసారు. ఇందులో నటించిన  హీరోయిన్  నవ్వుతోందో! ఏడుస్తుందో!…. తెలియని అయోమయంలో ఉంటారు ప్రేక్షకులు..కానీ అందాలు మాత్రం ఏమాత్రం దాచుకోకుండా బాగానే ఆరబోసింది. ఈ సినిమాలో ఎటు చూసిన కమెడియన్స్ కనిపిస్తుంటారు. ఈ సినిమా మొత్తం కామెడి అడ్డం పెట్టుకొని నడిపించాలని చూశాడు దర్శకుడు.

నటీనటుల పనితీరు :

సుశాంత్ సరదాగా సాగిపోయే పాత్రలో బాగానే నటించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్……. కష్టమైనా కూడా సుశాంత్ చేశాడు . ఇక సోనమ్ భజ్వా నటన పరంగా ఏమి లేకున్నా, పాటల్లో అందాల ప్రదర్శన చేసింది. అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెల్ని అంటూ వచ్చే ఝాన్సీ కామెడీ ఆకట్టుకుంది. అలాగే పృద్వి కామెడి పరవాలేదు అనిపించేలా చేశాడు. పోసాని కామెడీ అంతగా లేదు. నాగ చైతన్య స్పెషల్ ఎంట్రీ కథకు కనెక్ట్ అయ్యే విధంగా బాగుంది. అఖిల్,సుశాంత్ కలసి ఒక పాటలో అలరిరిస్తారు.

సాంకేతిక వర్గం పనితీరు:

సరైన కథ, కథనం లేకుండా ఇలాంటి సినిమా ఎందుకు ఎంచుకున్నాడో దర్శకుడు జీ. నాగేశ్వర్ రెడ్డి అతనికే తెలియాలి. ఈ సినిమాలో చెప్పుకునే అంశం మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్ అంతగా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు అయితే చాలా నీరసంగా కనిపించాయి. సొంత నిర్మాణం కాబట్టి కొడుకు కోసం బాగానే ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • సుశాంత్
  • పృథ్వి
  • కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • కథనం
  • హీరోయిన్
  • నో లాజిక్

అలజడి రేటింగ్: 1.75/5

(Visited 288 times, 1 visits today)