Home / Inspiring Stories / అటు లగడపాటి- చంద్రబాబు ఇటు జగన్- రామోజీ..!

అటు లగడపాటి- చంద్రబాబు ఇటు జగన్- రామోజీ..!

Author:

ఊహించని మలుపులతో ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తారాస్థాయి కి చేరుకున్నాయి. పిల్లీ ఎలుకా,పులీ ఆవుల స్నేహం లా రాజకీయ హేమాహేమీ ల మధ్య నయా దోస్తానాలు రాజకీయ విశ్లేషకులకు సైతం అందనంత సస్పెన్స్ తో సాగుతున్నాయి.  మొన్నటికి మొన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ సి.యం చంద్రబాబుల భేటీ కలకలం సద్దు మనగక ముందే. నిన్నటి తాజా పరిణామం ఒక్కొక్కరినీ తాము చూస్తున్నది కలా నిజమా అర్థం కాని పరిస్థాతుల్లోకి నెట్టేసాయి…

తాజా వార్తల ప్రకారం కొన్ని రోజులముందు ఢిల్లీలో చంద్రబాబుని కలిసిన లగడపాటి రాజగోపాల్ చాలా సేపే మంతనాలు జరిపారట. తెలంగాణ ఏర్పడితే శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన లగడపాటి ఇప్పుడు తెలుగుదేశంలో చేరి పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం ఆరంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న సందర్భంగా లగడపాటి గురువారం ఆయనను రహస్యంగా కలుసుకుని రాజకీయ పునఃప్రవేశంపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాజధాని నిర్మాణం వంటి పనులపై చర్చించినట్లుగా లగడపాటి బయటకు చెప్పుకొచ్చారు. కానీ అది ఆయన రాజకీయ పునఃప్రవేశానికి రంగం సిద్దం చేసుకోవటానికే అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు..

ఇదిలా ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లి ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావును కలిశారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది. జగన్ వెంట తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, వైసీపీ ప్రముఖుడు విజయ సాయిరెడ్డితో పాటు మరో ఇద్దరు రాయలసీమ శాసనసభ్యులు కూడా ఉన్నారు. రామోజీరావు, జగన్‌మోహన్‌రెడ్డిల నడుమ ఈ సందర్భంగా సుదీర్ఘ మంతనాలు జరిగినట్టు సమాచారం. ఈ భేటీ మర్యాదపూర్వకమైనదేనని బయటికి చెబుతున్నా… భేటీ సమాచారం టీడీపీ, వైసీపీ, మీడియా వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తున్నది.

ఈ భేటీ తో కొంత కాలం గా చంద్రబాబూ రామోజీ ల మధ్య  జరిగే కోల్డ్ వార్ బయట పడ్డట్టే అనీ. ఇక తర్వాతి ఎన్నికల్లో అధికారం జగన్ కి వస్తుందనే నమ్మకం తోనే తమ నాయకున్నిరామోజీ ఆహ్వానించాడని వైసీపీ జనాలూ అనుకుంటున్నారు. అదేం లేదు జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని కేసుల నుంచి బయట పడేయాలంటే. అది రామోజీ వల్లనే ఔతుందనీ, మోడీ తో రాయబారం నడాటానికే రామోజీని జగన్ బతిమాలుకున్నాడనీ టీడీపీ వర్గాలూ పైకి చెప్పుకుంటున్నా ఎవరి భయ్యలు వాళ్లలోనే ఉన్నయని తెలుస్తోంది.. . ఈ మధ్య జగన్ సతీమణి, రామోజీ కోడలు శైలజా కిరణ్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నటుడు మోహన్‌బాబు ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో రామోజీరావు, జగన్ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు ఆసక్తిని రేకెత్తించాయి. తరువాత రెండు గ్రూపుల ముఖ్యుల నడుమ సంబంధాలు బాగా మెరుగుపడినట్టు చెబుతున్నారు.  ఈ స్నేహమే జగన్ రామోజీతో కలిసేదాకా వెళ్లింది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు విఫల పాలన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రామోజీ జగన్ కు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుండగా, దాంతో పాటు హైదరాబాద్ లో రామోజీతో పాటు జగన్ కు ఉన్న అక్రమ ఆస్తుల నేపథ్యం కూడా దీనికి కారణం అని అంటున్నారు.

మొత్తానికి రాజకీయం మాంచి రసపట్టులోకొచ్చింది ఏం జరగబోతుందో చూడాల్సిందే…

(Visited 81 times, 1 visits today)