Home / Inspiring Stories / ఆవుని తింటే నీ తల నరుకుతా.

ఆవుని తింటే నీ తల నరుకుతా.

Author:

Karnataka cm Siddaramaiah

భారత దేశంలో ‘బీఫ్‌’ వివాదం తారా స్థాయికి చేరింది. బీఫ్‌ తింటే తల నరికేస్తానని, దాంతో ‘ఫుట్‌బాల్‌’ ఆడుకుంటానని సీనియర్‌ బిజెపి నేత ఒకరు ఏకంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రినే హెచ్చరించాడు. ఇప్పటి వరకూ లేదు గానీ తాను ఇక నుండి బీఫ్‌ తింటానని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తాజా దాడుల నేపథ్యం లో అన్న సంగతి తెలిసిందే .ఆ వ్యాఖ్యలలో బీఫ్‌ తినే హక్కు తనకుందని, దానిని ఎవరూ అడ్డుకోలేరని సిద్ధ రామయ్య  పేర్కొన్నారు. బిజెపి,ఆర్ ఎస్సెస్ కార్యకర్తలతో ఒక సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.కర్ణాటక బీజేపీ నాయకులు.ఈ సందర్భంగా బిజెపి షిమోగ జిల్లా కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడ్యూరప్పకు అతి సన్నిహితుడు కూడా అయిన చన్నబసప్ప పై వ్యాక్యలు చేసాడు. అంతే కాదు ఆ రెండోరోజున కూడా తన హెచ్చరికలకు మరింత పదును పెంచి మాట్లాడాడు. “సిద్ధరామయ్యకు దమ్ముంటే, షిమోగాకు రావాలి. గో మాంసాన్ని తినాలి. అతను బీఫ్‌ తింటే, ఆయన శరీరం నుండి తల వేరవుతుంది.దాంతో మేము ఫుట్‌బాల్‌ ఆడుకుంటాం.మేము అతన్న క్షమిస్తామనుకుంటే, అది ఆయన పొరపాటు” అంటూ తీవ్ర పదజాలంతో చిన్నబసప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

“నాకు జీవితం పట్ల తనకు ఎలాంటి భయంలేదు, ధైర్యముంటే అరెస్టు చేసుకోండి” అంటూ సిద్ధరామయ్యకు సవాలు కూడా విసిరారు. ‘నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నది నేనా? ఆ ముఖ్య మంత్రా?? సిద్ధరామయ్యపైనే చర్య తీసుకోవాలి. నా మీద కాదు’ అంటూ తన విద్వేషపూరిత వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆవును పూజించే వారెవరైనా ఈ పని చేస్తారంటూ వ్యాఖ్యానించారు. నేరపూరిత బెదిరింపు కేసు కింద అతనిని చన్న బసప్పను మంగళవారం పోలీసులు అరెస్టు చేసారు. బిజెపి నేత వ్యాఖ్యలను పరిశీలించాలని, అవి నిజమని తేలితే చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులను ముందుగా ఆదేశించారు. ‘ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలే. అందుకే మేము బిజెపిని వ్యతిరేకిస్తున్నాము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న, అసహనా న్ని ఎగదోస్తున్న వారిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. నన్ను ఎవరూ బెదిరించలేరు’ అని సిద్ధరామయ్య అన్నారు. దేశంలో పెరుగుతున్న మతతత్వానికి వ్యతిరేకంగా మేధావుల నుండి తీవ్ర నిరసన  వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 40 మంది రచయితలు, 12 మంది సినీ రంగ ప్రముఖులు తమ పురస్కారాలను వెనక్కు ఇచ్చారు

(Visited 61 times, 1 visits today)