Home / Political / ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం.

ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం.

Author:

Rain in India

గత కొద్ది సంవత్సరాల నుండి సరైన వర్షాలు లేక రైతన్నలు,కూలీలు వలస బాట పట్టారు. గ్రామలలో ఉండే జనం కాస్తా అప్పుల భాధలకు తట్టుకొలేకా వలస బాట తప్పడం లేదు. ఎన్ని రోజులు అయ్యిందో చుక్క నీటి బొట్టు ఆకాశం నుండి నేలకు రాలి. తాగాడానికే నీరు లేదంటే ఇక సాగుకు ఎక్కడ నుండి నీరు వస్తుంది. నిండా కష్టాల్లో మునిగిన అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేది ఏమి లేదు అని అనుకుంటున్నారు రైతులు. కానీ ఈ సంవత్సరం అంత కష్టం ఉండకపొవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం పుల్లుగా వర్షాలు కురుస్తాయట!. సాధారణం కన్నా అధికంగానే వానలు పడతాయంటున్నారు వాతావరణ నిపుణులు. సాధారణం కన్నా 5 శాతం ఎక్కువగా వర్షాపాతం నమోదవుతుందని వారంటున్నారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే పూర్తిస్థాయలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దేశంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణంగా 887 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవుతుంది. అయితే.. ఈ సారి ఇది 5 శాతం అదనంగా ఉండే అవకాశముంది. దేశం మొత్తంలో ఎక్కువగా తూర్పు మరియు మధ్య భారతంలో కురుస్తాయని ఓ సంస్థ వెల్లడించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని దృవీకరించింది. ఈ మధ్య ఎల్ నినో ప్రభావం తగ్గడంతో ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఇన్ టైంలోనే వస్తాయని చెప్పారు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన కే పట్నాయక్.

(Visited 616 times, 1 visits today)