Home / Inspiring Stories / ఎ.సి. గదుల్లో కూర్చుని రాసేది చట్టం అయితే….లక్షల మంది ప్రజలు వ్యతిరేకించేది శాసనం !

ఎ.సి. గదుల్లో కూర్చుని రాసేది చట్టం అయితే….లక్షల మంది ప్రజలు వ్యతిరేకించేది శాసనం !

Author:

అసలీ గవర్నమెంట్లకు ఉన్నట్టుండి హెల్మెట్లు ఎందుకు గుర్తొస్తాయి… మా నెత్తిన హెల్మెట్ పెట్టకండి..మా తలను ఎలా రక్షించుకోవాలో మాకు తెలియదా? మా తల గురించి ప్రభుత్వానికి ఎందుకంత బాధ? మా తలను అడ్డంపెట్టుకుని అడ్డమైన హెల్మెట్‌ కంపెనీలు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నదెవరు? హెల్మెట్‌ వల్ల రక్షణ వుంటుందనుకుంటే…స్వచ్ఛందంగా హెల్మెట్‌ కొని వేసుకోమా? మీరు ఎందుకు బలవంతపెడుతున్నారు?

నిజంగా మా తలను రక్షించాలన్న తపనా…హెల్మెట్‌ కంపెనీలను వ్యాపారాన్ని పెంచిపోషించే ప్రయత్నమా? హెల్మెట్‌ వేసుకోనందుకు రూ.1000 ఫైన్‌ వేస్తున్నారే….రోడ్లు అంత ఛండాలంగా వున్నందుకు ప్రభుత్వానికి ఎప్పుడైనా ఫైన్‌ వేశారా? మద్యం సేవించడం వల్ల సంసారాలు నాశనం అవుతున్నాయే …ఏనాడైనా మద్యం తయారీ కంపెనీలకు ఫైన్‌ వేశారా? ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ఫైన్‌ వేశారా? మద్యం వల్ల ఆరోగ్యాలు పాడై పోతున్నాయని, మనుషులు చస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నా ఎందుకు పట్టించుకోరు? అవి చావులు కావా? మద్యం దుకాణాలను కోర్టులు ఎందుకు నిర్భందంగా మూసివేయించవు?

ప్రాణాంతకమైన వ్యాధులతో ఎందరో చస్తున్నారే…ఇలాంటి వాళ్లకు ఇంతే నిర్భందంగా వైద్యం ఎందుకు చేయించరు? సిగరెట్ తాగే వాళ్ళు… అ పొగ పీల్చే వారు ఇద్దరి ఆరోగ్యం పాడవుతున్న సిగరెట్ ని  ఎందుకు ఆపరు …తాగడానికి మంచి నీళ్లు దొరక్క…వ్యాధుల బారినపడి మరణిస్తున్నారే నిర్భందంగా మంచినీళ్లు ఎందుకివ్వరు? ఇవ్వని ప్రభుత్వాలకు ఎందుకు ఫైన్‌ వేయరు?

ఇలాంటివి ఎన్నోవున్నాయి….వాటిని చూడండి. రక్షించే పేరుతో మా నెత్తిన హెల్మెట్‌ పెట్టకండి. మా తలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు …ఎయిర్ కండిషన్  గదుల్లో 10 మంది కుర్చుని రాసేది చట్టం అయితే లక్షల మంది ప్రజలు వ్యతిరేకిస్తే అది శాసనం అవుతుంది .. మాకు ఇష్టం లేని చట్టాలు మా నెత్తిమీద పెట్టొద్దు ప్లీజ్ …నిజమే…సోషల్ మీడియాలో..ప్రత్యేకించి వాట్సప్ లో….కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న ఈ మెసేజ్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో లెక్క కట్టలేని పరిస్థితి….మనం టు వీలర్ తీస్తే …అన్నీ గతుకుల  రోడ్లే….మరి రోడ్ల అధ్వాన్న స్థితి మీద గవర్నమెంట్ ఎప్పుడైనా రోడ్లు, భవనాల శాఖ కు జరిమానా విధించిందా? మురికి నీళ్ళు పంపిణీ చేస్తున్న జలమండలి కి ఫైన్ వేసిందా ? బహిరంగ ప్రదేశాల్లో ధూమ, మద్య పానాలకు కారణమవుతున్న సిగరెట్, లిక్కర్ కంపెనీలకు ఎపుడైనా పెనాల్టీ విధించిందా? నిర్బంధ హెల్మెంట్ కన్నా ముందు, నిర్బంధ మంచి నీళ్ళు, నిర్బంధ పారిశుధ్యం అమలు చేయించండి. మా ఆరోగ్యాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి గదా…..ఆ ప్రభుత్వాలకు చెప్పండి…మేము కట్టే ట్యాక్స్ లతోటే….మున్సిపల్ కార్పొరేషన్లు నడుస్తున్నాయి….రహదార్లు, భవనాల శాఖల కార్యాలయాలు నడుస్తున్నాయి….అని ! మొత్తానికి …..ముందుగా మంచి రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థల మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే …అప్పుడు చూస్తాం..హెల్మెట్లు ధరించాలా , వద్దా? అనే వ్యవహారాన్ని అంటూ గట్టి  చురకలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసైనా గవర్నమెంట్ దిగిరావాలని నేటిజెన్లు కోరుతున్నారు.

(Visited 77 times, 1 visits today)