Home / Inspiring Stories / ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఒక యువకుడిని చంపేసిన మధ్య ప్రదేశ్ పోలీసులు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఒక యువకుడిని చంపేసిన మధ్య ప్రదేశ్ పోలీసులు.

Author:

Bhopal: Accident victim dies as police secure the road for Madhya Pradesh CM

ఒక పౌరుడి రక్షణ కన్నా ఒక నాయకుడికి ఏర్పడే కొన్ని నిమిషాల అసౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు పోలీసులు. ప్రమాదంలో గాయపడి మరణించటానికి సిద్దంగా ఉన్న ఒక మనిషిని హాస్పిటల్ కి తరలించాల్సిందిపోయి ముఖ్య మంత్రి కాన్వాయ్ కి ఇబ్బంది కలగకుండా అతన్ని పుట్ పాత్ మీద పడేసి తమ “డ్యూటీ” నిర్వర్తించారు. ఫలితం అంతమంది మనుషులు చుట్టూ ఉండి కూడా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ దేశ పౌరుడి ప్రాణాలకు అసలు విలువే లేదని నిరూపించారు.

భోపాల్ అసెంబ్లీ ముందు మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి కాన్వాయ్ రావటానికి కొన్ని నిమిషాల ముందు ఒక రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక బస్సు అటుగా వస్తున్న 22 ఏళ్ళ యువకుడి బైక్ ని గుద్దేయటం తో రోడ్డు మీద పడ్డ అతనికి బలమైన గాయాలయ్యాయి. అక్కడే విదుల్లో ఉన్న ఆరుగురు ట్రాఫిక్ పోలీసులూ,పోలీస్ అధికారులూ వెంటనే ఆ బస్ ని పక్క కు తీయించి దెబ్బలు తగిలిన యువకున్ని. ఆసుపత్రికి తరలించటం మానేసి. కొద్దిసేపట్లో రానున్న ముఖ్యమంత్రి ప్రయాణానికి అసౌకర్యం కలకూడదంటూ ఆ యువకున్ని రోడ్డు మీదనుంచి కాస్త పక్కకు జరిపి అలా వదిలేసారు. విపరీతంగా రక్తం పోయి చావుకు దగ్గరలో ఉన్న అతన్ని వదిలేసి. ముఖ్యమంత్రికి సలాం కొట్టేందుకు పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చి వెళ్ళిపోయే దాకా కనీసం ఆంబులెన్స్ కి కూడా కాల్ చేయలేదు. అక్కడ గుమిగూడిన మనుషులు కూడా ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు తప్ప అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కొన ఊపిరితో అక్కడే పడి ఉన్న అతన్ని ప్రాణాలు పోతూన్నా చలించలేదు. కొద్దిసేపటికి అతను చనిపోయాడు.

ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అతన్ని రక్షించటం మానేసి రోడ్డు పక్కన పడేసి చేతులు దులుపుకున్న పోలీసులమ్నీదా,తీరిగ్గా వీడియోలు తీస్తూ కూచున్న మనుషుల మీదా ఇప్పుడు నెట్లో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా తెలిసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్… “ఇది క్షమించరాని నేరం. దీనిపై విచారణకు ఆదేశించాం, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దయచేసి వారికి సహాయం చేయండి అని ప్రజలను కోరుతున్నాను. మరణించిన ఆ యువకుడి కి నా నివాళులు. అతని కుటుంబానికి ఆ దేవుడు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు..

వీవీఐపీ సంస్కృతి వల్ల అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలుకోల్పోవటానికి ఎవరు భాద్యత వహిస్తారు. ఒక ప్రముఖుడి కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులూ, మనకెందుకు లెమ్మని ప్రజలూ… ఒక మనిషి మరణాన్నీ ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసుకున్న మనుషులూ. మనం నిజంగా మనుషుల్లానే జీవిస్తున్నామా???

Must Read:కళ్యాణ వైభోగమే సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 3,907 times, 1 visits today)