Home / Inspiring Stories / చీకటితో యుద్దం చేస్తున్న మిణుగురు

చీకటితో యుద్దం చేస్తున్న మిణుగురు

Author:

laxmi

కొన్ని చుక్కల ద్రవం మొకం పై చిందితే మొహమేనా కాలిపోయేది? ఆమె ఆత్మ విస్వాసం,సాటి మనుషుల మీద ఉండే నమ్మకమూ కాలిపోతాయ్. ఐతే డీలి కి చెందిన లక్ష్మి తన వొంటి మీద గాయాలతో బాటే తానూ మాడుతూ ఒక తిరుగుబాటు జ్వాలై మళ్ళీ నిలబడింది. ఆ ఘటన నుంచి తేరుకుని తన కాళ్లపై తాను నిలబడింది చీకటి గదిలో కమిలిన చర్మాన్నీ,పాడైన ముఖ సౌందర్యాన్నీ చూసుకుంటూ కుమిలి పోలేదు. తనలాంటి మరికొందరు బాదితుల కొసం నిలబడింది, పోరాడింది యాసిడ్ అమ్మకాల పై ఉన్న చట్తాలని సవరించేలా చేసింది.

16 సంవత్సరాల వయసులో తన ప్రేమని కాదందందనే కారణం తో ఆమెపై 32సంవత్సరాల వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మొహం మీద చర్మం దాదాపు గా కాలిపోయింది. కొన్నాళ్లకి కోలుకొన్నా ఆమె సమాజం తో నే పోరాటం చేయాల్సి వచ్చింది మొహంపై తీవ్రంగా గాయపడటం తో చిన్న పిల్లలు ఆమె దగ్గరికి రావటానికే బయపడ్డారు, అదికాదు ఆమెను బాదించింది పెద్దవాళ్లలో కూడా ఆమె ఎదుర్కున్న వివక్ష. తనలానే యాసిడ్ దాడికి గురై బాదపడుతున్న ఇతర బాదితులని ఆదుకోవాటనికి ఆమెను పురికొల్పింది. యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్ దాఖలు చేసింది. 27000 మందితో సంతకాలు సేకరించింది. లక్ష్మి 2006లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సెక్షన్‌ 357సి అమలుకు సంబంధించి ఆరు వారాల్లోగా జాబితా రూపంలో అఫిడవిట్‌ను సమర్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. యాసిడ్‌ దాడుల బాధితులకు తగు పునరావాసం కల్పించకపోవటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి హీనమైన దాడులకు గురైనవారికి ఉచిత చికిత్స అందించేందుకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని న్యాయమూర్తులు మదన్‌ బి.లోకూర్‌, యు.యు.లలిత్‌తో కూడిన సామాజిక న్యాయ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 357సి అమలు కోసం నియమ నిబంధనాలను రూపొందించేందుకు నాలుగు వారాల్లోగా రాష్ట్రాల ముఖ్య కార్శదర్శులు, సంబంధిత అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది. ”భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 357సి అమలుకు ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి? ఉచిత చికిత్స అందించేందుకు గల వ్యవస్థ ఏంటి? పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. దాన్ని అమలు చేయాలి” అని పేర్కొంది..యాసిడ్‌ దాడి బాధితులకు ప్రత్యేక ప్లాస్టిక్‌ సర్జరీ, ఇతర శస్త్రచికిత్సలు, చికిత్సలకయ్యే ఖర్చునంతా అందించేందుకు హరియాణా ప్రభుత్వం పథకాన్ని రూపొందించినా ఇతర రాష్ట్రాల వైఖరి మాత్రం మామూలుగానే ఉంది. స్త్రీలపై యాసిడ్‌ దాడులను అరికట్టటానికి ఇలాంటి దారుణాలకు పాల్పడటాన్ని బెయిల్‌కు వీలులేని నేరంగా చేయాలని, బాధితులకు రూ.3లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.

laxmi2

లక్ష్మి తన జీవన క్రమంలో అలోక్ దీక్షిత్ అనే సామాజిక కార్యకర్తతో ప్రేమలో పడింది. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేయడానికే మొగ్గుచూపారు. వారికి పుట్టిన పాపకు పిహు అని నామకరణం చేసుకున్నారు. ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ కడుపుతో ఉన్నప్పుడు ఆమె పడిన వేదన వింటే ఎవరికైనా మనస్సు చివుక్కుమంటుంది. పుట్టిన బిడ్డ తనను చూసి దగ్గరకు వస్తుందా ? భయపడి ఏడుస్తుందా.. ? అనే ప్రశ్నలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయట. కానీ ఇప్పుడు ఆ పడిన వేదనంతా పటాపంచలైపోయింది. తన తల్లి లక్ష్మిని చూడగానే.. పిహు.. కళ్లలో వెలుగు కనిపిస్తుంది. ఇది చాలు తల్లిగా లక్ష్మికి కొండంత బలం ఇవ్వడానికి. 2014లో అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్లీ ఒబామా చేతుల మీదుగా ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును లక్ష్మి అందుకున్నారు. ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యారు.

లక్నోలో షీరోస్ కేఫ్ ప్రారంభించాలనే లక్ష్యం తో అడుగులేస్తున్న లక్ష్మి కి ఆమె తోబాటూ ఉంటూన్న కార్యకర్త లూ.ఆమె భర్తా ఇచ్చే ప్రోత్సాహం, పాపని చూసుకోవటం లో ఇచ్చే సహకారం పెద్ద ఊరట. వీళ్లలో అధిక శాతం మంది యాసిడ్ దాడికి గురైన ప్రాణాలతో బయటపడిన వాళ్లే. ఇప్పుదు లక్ష్మి తో బాటు పీహూ కూడా జీవితం తో పోరాడటం నేర్చుకుంటోంది.

 

(Visited 167 times, 1 visits today)