Home / Entertainment / ఆది తండ్రి అయ్యాడు.

ఆది తండ్రి అయ్యాడు.

Author:
Source: Aadi Facebook

Source: Facebook- ActotAadi

నటుడు సాయి కుమార్ కొడుకు ఆది తండ్రి అయ్యాడు. తన భార్య అరుణ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. గత సంవత్సరం డిసెంబర్ 13 న ఆది అరుణ ను వివాహం చేసుకున్నాడు..సాయికుమార్ కుమారుడిగా వెండితెరకి ‘ప్రేమ కావాలి’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆది.., ఆ చిత్రం తర్వాత లవ్లీ, గాలిపటం, రఫ్ వంటి చిత్రాల్లో నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా దర్శకుడు మదన్ దర్శకత్వంలో ఆది, అదాశర్మలు జంటగా నటిస్తున్న చిత్రం ‘గరం’. ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ కథ నచ్చి నేనే ఈ సినిమాకి నిర్మాతగా ఉండాలని అనుకున్నానని, ఈ విషయం నాన్న గారికి చెప్తే సరే అన్నాడని దాంతో ఈ చిత్రానికి మేమే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నామని ఆది తెలిపాడు.

(Visited 46 times, 1 visits today)