Home / Entertainment / సూర్య “సింగం” టైటిల్ మార్చాలని ఫిక్స్ !?

సూర్య “సింగం” టైటిల్ మార్చాలని ఫిక్స్ !?

Author:

suriyahari

తమిళ సూపర్ స్టార్ సూర్యకి ఒక్కసారిగా సౌత్ లో క్రేజ్ తెచ్చిన సినిమా ‘గజినీ’. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ హరి, సూర్యని సూపర్ స్టార్ గా చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగం’. ఈ సినిమా సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్డమ్ తెచ్చి పెట్టింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన ‘సింగం 2’ కూడా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా మూడవ పార్ట్ కూడా రానుంది.

గత కొద్ది రోజులుగా ఈ డైరెక్టర్ హరి అండ్ టీం ఈ 3వ పార్ట్ కి అదే టైటిల్ పెట్టాలా లేక చేంజ్ చేయాలా అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ కి తెర దించుతూ సింగం 3 కి టైటిల్ మార్చాలని ఫిక్స్ అయ్యారు. మార్చిన టైటిల్ ని బుధవారం అనగా ఈ రోజు రాత్రి 12 గంటలపైన రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. సూర్య అభిమానులంతా ఈ క్రేజీ సీక్వెల్ కి ఏం టైటిల్ పెడతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ మేజర్ షెడ్యూల్ జనవరి 7 నుంచి వైజాగ్ లో మొదలవుతుంది. సౌత్ లో వస్తున్న మొట్ట మొదటి ట్రియోలాజీ ‘సింగం’ కావడం విశేషం.

(Visited 96 times, 1 visits today)