Home / Entertainment / నింగికెగసిన నృత్య తార జ్యోతి లక్ష్మి.

నింగికెగసిన నృత్య తార జ్యోతి లక్ష్మి.

Author:

ఒక తారా ఆ సినిమాలో నృత్యం చేస్తోంది అంటే ఆ సినిమా దాదాపు హిట్ కిందే లెక్క . ఆ ఒక్క తార కోసం, సినిమా హిట్ అవ్వడం చాలా మందికి అర్ధం కాలేదు. కానీ ఆ తారా నృత్యం కోసం సినిమా మొత్తం చూసే వారు. అప్పట్లో పెళ్లి కానీ కుర్రకారులకు తాను ఒక స్వప్నల సుందరి. ఆమె మన జ్యోతి లక్ష్మి. తను తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త పంతను సృష్టించింది అనడంలో సందేహం లేదు. 80, 90 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు జ్యోతిలక్ష్మి. క్లబ్ డాన్సులకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆ రోజులలో తన నృత్య అభినయంతో ఎంతో పేరు సంపాదించి ఒక తారగా వెలుగొంది ఇప్పుడు తను ఆకాశంలో ఒక తారగా మనకు అందనంత దూరంగా వెళ్ళిపోయింది. అవును తను ఈ రోజు ఉదయం చెన్నై లోని తన నివాసంలో కన్నుమూసింది.

Jyothi-Lakshmi-Passed-away

జ్యోతి లక్ష్మి 1948లో తమిళ సంప్రదాయ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. తన కుటుంబం చాలా పెద్దది ఎనిమిది మంది తోబుట్టువులు. తన తండ్రి ఎంత పనిచేసిన వారి ఆకలిని మాత్రం గెలువలేకపోయాడు. ఎన్నో రోజులు వారిని ఆకాలి వెంటాడింది, వేధించింది. తన సాంప్రదాయాలు బారి కుటుంబం ఆకలిని తీర్చలేవని చివరికి తనకు ఇష్టం ఉన్న నృత్య రంగంలోకి వచ్చింది. కానీ ఇక్కడ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి తన కుటుంబానికి పెద్ద గా అన్ని సమకూర్చింది. అలాగే జ్యోతి లక్ష్మి చిన్న చెల్లి జయమాలిని కూడా అక్క ఆసరాతో సినిమాలలో అక్కతో పాటు చాలా సినిమాలలో నృత్యం చేసింది. ఇలా ఇద్దరు దాదాపు కొన్ని వందల పాటలలో నర్తించారు. ఇక జ్యోతి లక్ష్మి సోలోగా, చెల్లితో కలిపి దాదాపు వెయ్యికి పైగా పాటలలో నర్తించింది. అలాగే దాదాపు 25 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటిచింది. తన భర్త పేరు సాయిప్రసాద్ తనకు ఒక కూతురు కూడా ఉంది తన పేరు జ్యోతిమీనా. జ్యోతి మీనా కూడా కొన్ని సినిమాలలో నటించి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

(Visited 120 times, 1 visits today)