Home / Entertainment / నాకు విడాకులు వద్దు … భర్తే కావాలంటున్న హీరోయిన్ రంభ.

నాకు విడాకులు వద్దు … భర్తే కావాలంటున్న హీరోయిన్ రంభ.

Author:

సెలబ్రిటీ జీవితాలు మనకు కనిపించేంత సంతోషంగా ఉండవు అనేది చాలా సత్యం. ఎందుకంటే వారి జీవితాలు ఎప్పుడు సముద్రంలోని అలల మాదిరిగా పైకి కిందకు అవుతుంటాయి. దానితో వారు అవకాశాలు ఉన్నప్పుడే సంపాదించుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. అలాంటి వారిలో నిన్నటి తరం నటి రంభ ఒకరు. తానూ లైమ్ లైట్ లో ఉన్నప్పుడు కుర్రకారు గుండెల్లో నిద్రలేకుండా చేసింది. దాదాపు పది సంవత్సరాలపాటు ఇటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

actress-rambha-battling-to-save-her-marriage_telugu

సినిమా కెరీర్ కి గుడ్ బై చెబుతూ 2010 ఏప్రిల్లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ పద్మనాభన్ ను పెళ్లీ చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా. కొన్ని సంవత్సరాలు హాయిగా సాగిన వీరి కాపురంలో అనుకోకుండా కొన్ని చిక్కులు వచ్చాయి దానితో కొద్దిరోజులుగా వేరు వేరుగా ఉంటున్నారు రంభ, ఆమె భర్త. కొన్ని రోజుల క్రితం పద్మనాభన్ విడాకులు కోరుతున్నట్టు వార్తలు వచ్చాయి దానితో రంభ డైవర్స్ వద్దని చెన్నై ఫ్యామిలీ కోర్ట్ ని ఆశ్రయించింది. సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని తన భర్తతో విడాకులు వద్దని మా ఇద్దరికీ కలసి ఉండేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసు డిసెంబర్ 3 వ తేదీన విచారణకు రానుంది.

(Visited 360 times, 1 visits today)