Home / Entertainment / క్వీన్ బాధ్యతలు తన పై వేసుకున్న రేవతి.

క్వీన్ బాధ్యతలు తన పై వేసుకున్న రేవతి.

Author:

Revathi and Suhasini

రేవతి ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో దర్శకురాలిగా సృజనాత్మకమైన చిత్రాలను తెరకెక్కించారు. సుహాసిని నటిగానే కాకుండా ఇందిర చిత్రంతో దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇప్పుడు వీరి గురించి ఎందుకు అనుకుంటున్నారా! వీరిద్దరి కళయికలో ఇప్పుడు ఒక సినిమా రానున్నది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘క్వీన్‌’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రీమేక్‌ చేయాలని నిర్మాత త్యాగరాజన్‌ గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా దర్శకత్వ బాధ్యతలు నటి రేవతికి అప్పగించినట్టు వినవస్తోంది సుహాసిని మణిరత్నం మాటలు అందిస్తుంది. ఒకరు మాటలతో ఒకరు చేతలతో ప్రత్యేకత చూపించనున్నారు. ఈ చిత్రంలో కంగనారావత్ పాత్రలో నటించే అదృష్టం దక్కిం చుకునే దక్షిణాది నటి ఎవరు?అన్న ఆసక్తికరమైన ప్రచారం జరుగుతూనే ఉంది.

వికాస్ భాల్ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన ‘క్వీన్’ చిత్రం 2013 లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా కంగనా రనౌత్ తన నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

(Visited 280 times, 1 visits today)