Home / Inspiring Stories / లీటర్ పెట్రోల్ ప్రభుత్వం ధర 11/- మరి మరి ప్రజల దగ్గరికి వచ్చేసరికి 60/- పైగా ఎందుకవుతుంది?

లీటర్ పెట్రోల్ ప్రభుత్వం ధర 11/- మరి మరి ప్రజల దగ్గరికి వచ్చేసరికి 60/- పైగా ఎందుకవుతుంది?

Author:

petrolfilling

మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి బైక్, కారు లేదా ఆటో ఏదో ఒక వాహనం ఉండే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా వేగంగా తయారు అయ్యింది కదా! అందుకే ఎక్కడికి వెళ్ళాలి అన్నా మనకు ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండాలి. కానీ, వాహనం నడవాలి అంటే పెట్రోల్ కావాలి కదా! మరీ, ఈ పెట్రోల్ మనకు ఎంతకు వస్తుందో తెలుసా? వాస్తవానికి లీటర్ పెట్రోల్ ధర 11/. అవును మీరు చదివింది నిజమే. మరి ఈ విషయం నిజమే అయితే మరి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ కు 60రూ.. ఎందుకు తీసుకుంటుంది అనుకుంటున్నారా! ఈ ధర ముడిసరుకుగా ఉన్నప్పటి సంగతి అన్నమాట. మరీ ముడి సరుకు ఉన్నప్పుడు 11రూపాయలకు వస్తే పెట్రోల్ గా మార్పిడి చెందిస్తే రూ.30నుండి 40 తీసుకోవాలి కానీ మరీ 60రు.. ఎందుకు తీసుకుంటున్నారు అంటే మన ప్రభుత్వాలు నడిచేది మధ్యం,పెట్రోల్ పై వచ్చే ఆదాయంపైనే

ముడి సరుకుగా ఉన్న పెట్రోల్ మన వాహాన దారుడి దగ్గరికి వచ్చేసరికి ఏవిధంగా రేటు పెరుగుతుందో ఒక సారీ చూద్దాం ……

1 లీటర్ ముడిసరుకు (ఆయిల్)ధర: రూ.11.21
2. సముద్రపు సరుకు మరియు రవాణా ఛార్జీ: రూ. రూ.8.49

                                                               మొత్తం: 11.21+8.49= రూ.19.70

3. డీలర్స్ (పెట్రోల్ పంప్ యజమానులు) ఛార్జీ, ఎటువంటి వ్యాట్ లేకుండా= రూ.3.77

4.ఎక్సైజ్ డ్యూటీకి (కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది)=రూ.21.48

5. డీలర్ కి ఇచ్చే కమీషన్=రూ.2.25

6. రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్ (ఒక్కో రాష్ట్ర ప్రకారం.. ఢిల్లీలో 27%)=రూ.12.74

                                                              మొత్తం: రూ.19.70+3.77+21.48+2.25+12.74

                                                                           =రూ. 59.95(పొల్యూషన్ సెస్ అధనం).

7. వినియోగదారుడికి అమ్మే ధర =రూ.59.95.

8. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ మీద 35.20%, డీజిల్ మీద 27% టాక్స్ ను విధిస్తుంది.

process of petrol rate rising

(Visited 1,067 times, 1 visits today)