Home / Inspiring Stories / మానవత్వం బ్రతికే ఉందని నిరూపించిన ఆదిత్య తివారి.

మానవత్వం బ్రతికే ఉందని నిరూపించిన ఆదిత్య తివారి.

Author:

ఇప్పటి యువత ఆలోచనలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొంతమంది యువత ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకోని శబాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు పుణెకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆదిత్య తివారి. ఎందుకంటే నవమాసాలు మోసి కన్న తమ కుమారుడికి ఒక పెద్ద జబ్బు ఉందని తెలిసి ఒక అనాద శరణాలయంలో వదిలివెళ్ళిపోయారు తల్లిదండ్రులు, కానీ వివాహం కూడా అవని ఆదిత్య చాల ఆటంకాలను ఎదుర్కొని ఆ అబ్బాయిని దత్తత తీసుకొని తనకి తండ్రి అయ్యి తన కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.

ఆదిత్య 2014 లో తన తండ్రి పుట్టిన రోజున ఇండోర్ లో ఉన్న మిషనరీ ఆఫ్ చారిటి సంస్థ నడిపే ఒక అనాధాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పిల్లలకు తాను తీసుకెళ్లిన గిఫ్ట్స్ పంచిపెట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న బిన్నీ అనే బాబుపై ఆదిత్య దృష్టి పడింది. అక్కడ ఉన్న పిల్లందరూ హుషారుగా బొమ్మలు తీసుకోని ఆడుకుంటుంటే బిన్నీ మాత్రం మంచంపైనా అచేతనంగా ఉన్నాడు. దానితో బిన్నీపై ఆదిత్యకు ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ఆ బాబుకి డౌన్స్ సిండ్రోమ్ అనే జబ్బుతోపాటు గుండెకు చిల్లుకూడా ఉందని అందుకే బిన్నీ తల్లిదండ్రులు అనాధశరణాలయంలో వదిలివెళ్ళిపోయారు అని తెలుసుకున్నాడు. ఆ సమయంలో బిన్నీని పలకరించే ప్రయత్నంలో ఆ బాబు ఆదిత్య వేలు గట్టిగా పట్టుకున్నాడు.

aditya-tiwari-adopted-a-boy

కొన్ని రోజుల తర్వాత ఆదిత్య మరోసారి అదే అనాధశరణాలయానికి వెళ్ళాడు. అప్పటికీ అక్కడ ఉన్న చిన్నపిల్లలని సంతానం లేనివారు దత్తత తీసుకోని వెళ్లిపోయారు. కానీ బిన్నీకి మాత్రం గుండె జబ్బు ఉందని ఎవరు తీసుకోని వెళ్ళలేదు. దానితో బిన్నీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికి పెళ్లికాని కొడుకు మరొక పిల్లాడికి తండ్రి అవుతానంటే భవిష్యత్తులో తమ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆదిత్య తల్లిదండ్రులు దానికి నిరాకరించారు. కష్టపడి వారిని ఒప్పించాడు ఆదిత్య. కానీ ఆ తరువాతనే ఆదిత్య కష్టాలు మొదలయ్యాయి….
ఎందుకంటే పెళ్లికాని ఆదిత్యకు బిన్నీని దత్తకు ఇవ్వడం కుదరదు అని ఆశ్రమ నిర్వాహకులు చెప్పేసారు.

దానితో వారికి చాలా విధాలుగా నచ్చచెప్పడానికి చూశాడు కానీ వారు రూల్స్ కి వ్యతిరేకంగా ఇవ్వడం కుదరదు అని చెప్పేశారు. చివరికి శిశుసంక్షేమ శాఖ వారిని కూడా సంప్రదించాడు. దానితో ఆ శాఖ మంత్రి మానేక గాంధీ కి దాదాపు 100 మెయిల్స్ పంపించాడు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయానికి మెయిల్స్ పంపించాడు. దానితో మంత్రి మానేక గాంధీ ఆదిత్యకు స్వయంగా ఫోన్ చేసింది అలాగే భోపాల్ చైల్డ్ వెల్ఫర్ కమిటీ తో మాట్లాడి ఈ విషయం పై చూడవలసిందిగా “దత్తత వ్యావహారాలు చూసే కేంద్ర అథారిటీ” వారిని కూడా మానేక గాంధీ ఆదేశించారు. ఆదిత్య ఫిర్యాదుల తరువాత బిన్నీని ఇండోర్ అనాధాశ్రమామ్ నుండి భోపాల్ లోని మాతృ ఛాయ సంస్థకు పంపించారు. ఆ సంస్థవారు కూడా బిన్నీని, ఆదిత్యకు దత్తత ఇవ్వడానికి అంగీకరించలేదు. మానేకా గాంధీ స్వయంగా ఫోన్ చేసిన అంతగా పట్టించుకోలేదు సంస్థవారు. ఒక వేళా పెళ్లి కానీ వారు దత్తకు తీసుకోవాలి అంటే వారి వయసు కనీసం 30 సంవత్సరాలు ఉండాలి కానీ ఆదిత్య వయసు 28 మాత్రమే.

కేంద్ర ప్రభుత్వం ఈ వయసును 2015 లో 25 సంవత్సరాలుగా మార్చింది. దానితో అన్ని అర్హతలు ఉన్నా బిన్నీ దత్తతకు మాతృ ఛాయ సంస్థవారు ఒప్పుకోలేదు.దానితో పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఆదిత్య ప్రధాని కార్యాలయానికి, శిశుసంక్షేమ శాఖకు ఫిర్యాదు చేశాడు. దానితో ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరుతూ ఉత్తరం రాసింది.

ఇక అన్ని వైపులా నుండి ప్రభుత్వ వత్తిడి పెరగటంతో చివరికి 2015 లో డిసెంబర్ లో మాతృ ఛాయ సంస్థ వారు ఆదిత్యకు బిన్నీని దత్తత ఇవ్వడానికి ఒప్పుకొని ఒక నెల తరువాత వచ్చి బాబుని తీసుకోని పోవలసిందిగా కబురు చేశారు. దానితో ఒక నెల తరువాత ఆదిత్య వెళ్లి బిన్నీని తెచ్చుకున్నాడు. ముందుగా బాబు పేరుని అన్విష్ తివారీగా మార్చాడు. ఆ తర్వాత బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఒక మంచి డాక్టర్ కి చూపించాడు. దానితో డాక్టర్స్ గుండెకు అప్పుడే ఆపరేషన్ అవసరం లేదని మందులతో నయం చేసేందుకు ప్రయత్నిద్దామని డాక్టర్స్ చెప్పడంతో ఒకే అనుకున్నాడు కానీ ఆ బాబుకి మరొక జబ్బు ఉన్న సంగతి తెలిసిందే అదే డౌన్స్ సిండ్రోం.ఈ వ్యాధికి మాత్రం మందులు లేవు దానితో ఈ వ్యాధి ఉన్నవారి మానసిక పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది.

ఈ విషయం గురించి ఆదిత్య మాట్లాడుతూ … నా కొడుకుకి ఉన్న జబ్బు గురించి తెలుసుకుంటున్న, తనని కని వదిలివెళ్ళిన వారిలా నేను భాదపడను ఎంత ఖర్చు అయినా ఎంత ఖరీదైన వైద్యం అయినా చేయిస్తానని ఆదిత్య అంటున్నాడు. ఒంటరిగా కాకుండా పిల్లలతో కలసి ఆడుకుంటే అన్విష్ ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్స్ చెప్పడంతో, ఆదిత్య రోజు తనతో ఆఫీసుకి తీసుకెళ్లి అక్కడ ఉన్న డే కేర్ సెంటర్ లో ఉంచుతున్నాడు. పిల్లల్ని దత్తత తీసుకునేవారికి ఆదిత్య ఆఫీసులో 150 రోజులు వేతనంతో కూడిన సెలవు ఇస్తారట. కానీ ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సెలవు అవసరం రాలేదు అంటున్నాడు ఆదిత్య. ఎందుకంటే అన్విష్ ని చూసుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నాడు ఆదిత్య. ఇంకో మంచి విషయం..ఈ మధ్యె ఆదిత్యకు వివాహం కూడా అయ్యింది. ఆ కుటుంబం సుఖసంతోషాలతొ ఉండాలని కోరుకుందాం.

(Visited 3,192 times, 1 visits today)