Home / health / అల్లం వెల్లుల్లి పేస్టే కదా అని వాడితే ప్రాణాల మీదకు వస్తుంది.

అల్లం వెల్లుల్లి పేస్టే కదా అని వాడితే ప్రాణాల మీదకు వస్తుంది.

Author:

మన బిజీ లైఫ్ స్టైల్ వల్ల అన్ని రెడీమేడ్ వస్తువులకు అలవాటు పడ్డాం. ఐతే టైం లేదు కదా అని దొరికిన రెడీమేడ్ వస్తువుల్ని, వంట సరుకులని వాడే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఎక్కడ చూసినా కల్తీ. ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం, ఇటుక పొడితో తయారైన కారం, కల్తీ పాలు అన్ని చూస్తూనే ఉన్నాం. అయినా మన బిజీయో, బద్దకమో.. మనం మాత్రం ఇలా రెడీమేడ్ వాటికి అలవాటుపడి మన ఆరోగ్యాన్ని మనమే ప్రాణాల మీదకు కొని తెచ్చు కుంటున్నాం.

allam vellulli paste

ఏ వస్తువు కొన్నా ఏమున్నది గర్వకారణం.. ప్రతి వస్తువూ కల్తిమయమే కదా అన్నట్టు తయారయింది మన జీవితం. ఇక ఈ మధ్యే వెలుగు చూసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ వింటే షాకవుతారు. మాములుగా వంటలలో అల్లం వెల్లుల్లి వాడకపోతే నోటికి రుచే ఉండదు కాబట్టి ఏ వంటకైనా కావాల్సిందే ఈ అల్లంవెల్లుల్లి. ఐతే ఓ ప్రబుద్దుడు అల్లం, వెల్లుల్లి ఎదో అలా కలిపి మిగతా అంటా సిట్రిక్ యాసిడ్ తో నింపేసి ఛాయిస్ గోల్డ్ పేరుతొ విక్రయిస్తున్నాడు. ఈ అక్రమం బయటపడి పోలీసులు ఆ తయారి గోడౌన్ పై రైడ్ చేసేవరకు దాదాపు 900 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి బయటపడింది. ఈ అక్రమార్కులు రోజుకో రకం కల్తీ తో మార్కెట్లోకి వచ్చి మన ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. సో, తస్మాత్ జాగ్రత్త.. కల్తీ పై ఓ కన్నేయండి.. లేదంటే మీ జేబుకే కాదు ఆరోగ్యానికి పేద్ద కన్నం పడుద్ది.

(Visited 952 times, 1 visits today)