Home / Latest Alajadi / తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాసుకోవచ్చా..!?

తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాసుకోవచ్చా..!?

Author:

ఈ నెల మొత్తం కార్తీక మాసం. ఈ నెలలో కనీసం సగం రోజులైనా గుడికి వెళ్తారు. ఎందుకంటే పరమశివుడికి ఇష్టమైన మాసం కాబట్టి. మామూలు రోజుల్లోనైనా గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కొన్ని విషయాలను గమనించారా!… అందులో మనకు తెలియ కుండానే చేతులు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటాయి. రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము…. చేతులు ప్రార్థన చేస్తే తప్పు లేదు కానీ తీర్థంన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదు అంటున్నాయి శాస్త్రాలు.

theertham

గుడిలో తీర్థంన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదు. తీర్థం తీసుకున్నప్పుడు మన చేయి ఎంగిలి అవుతుంది. ఎంగిలి చేతిని తలకు రాసుకోవడం మంచిది కాదు. తీర్థం తీసుకున్న చేతిని సాధారణంగా నీటితో కడుక్కోవాలి.. గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థంన్ని మాత్రమే తలా వెనుక రాసుకోవచ్చు అంటున్నారు.

(Visited 11,698 times, 1 visits today)