Home / Political / జియో దెబ్బకు అందరూ ఫ్రీ కాల్స్ ఇస్తామంటున్నారు.

జియో దెబ్బకు అందరూ ఫ్రీ కాల్స్ ఇస్తామంటున్నారు.

Author:

మొదలుపెట్టిన 170 రోజులలోనే తమ ఉచిత ఆఫర్లతో 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది జియో. ఇన్నాళ్ళు ఇస్తున్న ఉచిత ఆఫర్లు ఈ మార్చి 31 తో ముగుస్తుండడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి ఇతర నెట్ వర్కులు కాని ఏప్రిల్ 1 నుండి 99 రూపాయలు కట్టే జియో ప్రైం సబ్ స్క్రైబర్స్ కి జియో ఫ్రీ కాల్స్, మెసేజ్ ల అఫర్లు ఇస్తుండడంతో ఆ అఫర్వ్కి కౌంటర్ వేయడం కోసం తాము కూడా ఫ్రీ కాల్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. జియో ఉచితంగా సర్వీసు అందిస్తుండడంతో ఇన్నిరోజులు ప్రజలు తమ పాత సిం కార్డులతో పాటు ఒక జియో సిం కూడా తీసుకున్నారు. ఇక ఇప్పటినుండి జియో కి కూడా డబ్బులు కట్టాల్సి రావడంతో ఇక ఎదో ఒక నెట్ వర్క్ ని వదిలేసే సమయం ఆసన్నం అయ్యింది. ఇటువంటి సమయంలో తమ ఖాతాదారులను కోల్పోకుండా జియో కి పోటీగా మేము కూడా ఫ్రీ కాల్స్ ఇస్తామంటూ కొత్త ప్యాకేజీలు ప్రకటించాయి ఎయిర్ టెల్ మరియు ఐడియా. ఆ ప్యాకేజీలు ఎమిటో కింద చదవండి.

airtel idea offers

జియో ప్రైమ్ ఖాతాదారులకు నెలకు 303 రూపాయలకు అన్ లిమిటెడ్  కాల్స్, మెసేజ్ లతో పాటు రోజు కు ఒక జీబీ 4జీ డేటా ఇవ్వబోతుంది జియో. ఇదే ప్లాన్ తరహాలో మార్చి 31 లోపు 349 రూపాయలతో రీచార్జి చేసుకుంటే  నెలకు అన్ లిమిటెడ్  కాల్స్, మెసేజ్ లతో పాటు రోజు కు ఒక జీబీ 4జీ డేటా ఇస్తామంటూ ఎయిర్ టెల్ తన సబ్ స్క్రైబర్స్ కి మెసేజ్ పంపుతోంది. ఈ ఆఫర్ సంవత్సర కాలం కావాలంటే తప్పని సరిగా మార్చి 31 లోపు 349 రూపాయలతో రీచార్జి చేసుకోవాలనే నిభందన పెట్టింది.. అంటే తమ సబ్ స్క్రైబర్స్ జియో వైపు శాశ్వతంగా మరిలిపోకుండా ఎయిర్ టెల్ జాగ్రత్త పడుతుందనే చెప్పోచ్చు. ఇక ఇదే తరహా అఫర్ ని ప్రకటించేందుకు ఐడియా పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 1 నుండి ఐడియా వినియోగదారులకు నేషనల్ రోమింగ్ రేట్లు ఉండవని ప్రకటించింది. ఇవన్ని చూస్తుంటే జియోను ఎదుర్కోవడానికి మిగతా నెట్ వర్కులు భారి కసరత్తులే చేస్తున్నట్లు కనపడుతుంది ఈ పరిణామాలతో ధరలు తగ్గుతాయని సామాన్య వినియోగదారుడు అనందం వ్యక్తం చేస్తున్నాడు.

(Visited 4,843 times, 1 visits today)