Home / Entertainment / అఖిల్ ఎంగేజ్ మెంట్ కార్డ్స్ వచ్చేశాయి.

అఖిల్ ఎంగేజ్ మెంట్ కార్డ్స్ వచ్చేశాయి.

Author:

అక్కినేని కుటుంబం అఖిల్ నిశ్చితార్థం వేడుకకు అన్ని సిద్ధం చేసే పనిలో మునిగింది. ఈ వేడుకకు ఆహ్వాన పత్రికలు వచ్చేశాయి. ఈ వేడుకకు డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు హైదరాబాద్ లోని జీవీకే హౌజ్ వేదిక కానుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డిజైనర్ శ్రేయా భూపాల్ ని అఖిల్ ప్రేమించిన సంగతి ఇంతకు ముందే అక్కినేని కుటుంబం మీడియాకు తెలిపిన విషయం మనకు తెలిసిందే. జీవీకే, అక్కినేని ఫ్యామిలీ కి చాలా రోజుల నుండి మంచి సంబంధాలు ఉన్నాయి దానితో ఇరు కుటుంబాలు వీరి పెళ్ళికి ఎలాంటి అడ్డులేకుండా ఒప్పుకున్నాయి.

akhil-engagement-cards

ఎంగేజ్ మెంట్ కార్డుని తాత అక్కినేని నాగేశ్వరావు, నానమ్మ అన్నపూర్ణల ఆశీర్వాదంతో అని ప్రింట్ చేయించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజాకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ‘ అఖిల్ ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని యంగ్ హీరో తన రెండవ సినిమా ఆలస్యం అవడం, దానితో తన నెక్స్ట్ సినిమాకు పలు దర్శకుల పేర్లు రావడం కొద్దీ రోజుల క్రితం చాలా హాట్ టాపిక్ అయింది చివరికి నాగార్జున అఖిల్ రెండవ సినిమా విక్రం కె కుమార్ తో ఉంటుందని తేల్చి చెప్పారు.

(Visited 446 times, 1 visits today)