Home / Inspiring Stories / అఖిల్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన నాగార్జున, వి వి వినాయక్.

అఖిల్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన నాగార్జున, వి వి వినాయక్.

Author:
అఖిల్ సినిమా వాయిదా వ్యవహారం అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ ని బాగానే బాద పెట్టింది. దానితో వారు రోడ్లపైకి వచ్చి నిర్మాత నితిన్ ని మరియు డైరెక్టర్ వినాయక్ ని తప్పుపట్టారు. సినిమా షూటింగ్ మొదలు అయినప్పటి నుండే దసరా రిలీజ్ అని చెప్పటం మరియు షూటింగ్ కూడా టైమ్ కి అయిపోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమా తప్పనిసరిగా అక్టోబర్22న వస్తుందని భావించారు. కానీ సరిగ్గా ఒక వారం ముందు సినిమా వాయిదా పడటం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు.
అందరు నితిన్ ని, వినాయక్ ని నింధిస్తుండడంతో నాగార్జున ఈ విషయంపై స్పందించారు. కేవలం ఒక సీక్వెన్స్లోని గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంవల్లే సినిమా వాయిదా పడింది అని వివరణ ఇచ్చారు. ప్రేక్షకులకు గొప్ప సినిమాని ఇవ్వడం కోసమే తన కలల ప్రాజెక్ట్ అయిన అఖిల్ సినిమా వాయిదా పడిందని, త్వరగా గ్రాఫిక్స్ పని పూర్తి చేసి త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని వినాయక్ చెప్పాడు. ఈ సందర్బంగా అఖిల్ ఫ్యాన్స్ అందరికి నాగ్ మరియు వినాయక్ సారీ చెప్పారు.
అఖిల్ అభిమానులు కూడా ఇది అర్దం చేసుకొని, వారి నిరసనలు ఆపి ఇంకొంత కాలం ఎదురు చూస్తే అక్కినేని వంశం నుండి వస్తున్న పవర్ఫుల్ హీరొ సినిమా చూసి ఆనందించవచ్చు.
(Visited 97 times, 1 visits today)