Home / Entertainment / దీపావళికే మెరవనున్న ఫైర్ బాల్.

దీపావళికే మెరవనున్న ఫైర్ బాల్.

Author:

Akhil movie release date and details

నటవారసుడే అయినా తోలి సినిమా రిలీజ్ కి ముందే తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని మార్కెట్ ని సృష్టించుకున్న యువ హీరో అఖిల్. తన పేరునే తన మొదటిసినిమా టైటిల్ గా వస్తున్న  ఈ హీరో సినిమా”అఖిల్” దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఉండాలి. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో ఈ చిత్ర టీం పూర్తి సంతృప్తికరంగా లేకపోవడం వలన సినిమాని వాయిదావేసారు. ఇక అప్పటి నుంచీ అఖిల్ పై రీ షూట్ జరుగుతుందని ఇప్పట్లో రిలీజ్ ఉండదనీ, సినిమా క్రిస్మస్ కి వస్తుందనే పలు రకాల ప్రచారాలు జరిగాయి. ఈ చిత్ర నిర్మాత అయిన నితిన్ దర్శకుడు వినాయక్ లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు కూడా. కానీ అవన్నీ నిజం కాదని, విఎఫ్ ఎక్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ లోఉందని త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అఖిల్ నిన్ననే క్లారిటీ ఇచ్చాడు.రీసెంట్ గా …తన సినిమా పనుల గురించి ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వివరించాడు.

సినిమా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్క విషయంలోనూ కచ్చితత్వాన్ని తీసుకొస్తున్నామని అఖిల్ తెలిపాడు. అలాగే ప్రేక్షకుల సహనానికి థాంక్స్ కూడా చెప్పాడు. మరిన్ని వివరాలతో త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశాడు అఖిల్. మళ్ళీ డిజైన్ చేస్తున్న విఎఫ్ఎక్స్ వర్క్ చివరి దశకు చేరుకుందనీ, మరో 5 రోజుల్లో ఆ వర్క్ మొత్తం పూర్తవుతుందనీ అనుకుంటున్నారు యూనిట్ సభ్యులు. అది అయ్యాక ఫైనల్ గా ఓకే అనుకుంటే అఖిల్ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 11నే రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలిపారు. అఖిల్ కూడా అనుకున్న టైంకి వర్క్ ని ఫినిష్ చేసి ఏ మాత్రం ఆలస్యం లేకుండా దీపావళికే సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.ఇప్పటికే రిలీజ్ డేట్ వాయిదా పడటం సినిమా ఫలితాల మీద ప్రభావం చూపొచ్చనీ,అంతే కాకుండా అఖిల్ కెరీకి కూడా అది మంచిది కాదనీ భావిస్తున్నారట. అన్నీ ఓకే అయ్పోతే ఈ దీపావలి కే అఖిల్ వెండి తెర మీద మెరవనున్నాడు..

వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపించనుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

(Visited 38 times, 1 visits today)