Home / Reviews / అఖిల్ సినిమా రివ్యూ & రేటింగ్.

అఖిల్ సినిమా రివ్యూ & రేటింగ్.

Akhil movie review and rating

Alajadi Rating

2.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అఖిల్‌ అక్కినేని, సయేషా సైగల్‌, మహేష్‌ మంజ్రేకర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి తదితరులు

Directed by: వి.వి. వినాయక్‌.

Produced by: నితిన్‌

Banner: శ్రేష్ఠ్‌ మూవీస్‌

Music Composed by: అనూప్‌ రూబెన్స్‌, తమన్‌. & మణిశర్మ.

అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు, నాగార్జున – అమలల ముద్దుల తనయుడు అఖిల్ తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని లాంచ్ చేస్తూ చేసిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు. ‘అఖిల్’ నేడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్నో అంచనాలు, అక్కినేని వంశాభిమానుల ఆశలు, మరో పెద్ద స్టార్‌ అవుతాడనే నమ్మకాలు.. అక్కినేని అఖిల్‌ తెర మీదకి వస్తూనే చాలా బాధ్యతలు భుజాన వేసుకొచ్చాడు. అఖిల్ మొదటి సినిమాతో వారి ఆశలను ఎంతవరకూ నిజం చేసాడనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

ఈ కథ మొత్తం జువా అనే బాల్ గురించి కాబట్టి ముందుగా దాని పరిచయం – సూర్యుడి నుంచి విడిపోయిన భూమి మళ్ళీ సూర్యునికి దగ్గరవుతూ ఉండడం వలన భవిష్యత్తులో భూమి మీద ప్రళయం వస్తుందని అప్పటి ఋషులు సూర్య కవచం ఆలియాస్ జువా అనే ఒక బాల్ ని తయారు చేసి భూమధ్య రేఖపై ఆఫ్రికాలోని ఓజా ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతిష్టిస్తారు. ప్రతి సూర్యగ్రహణం రోజు మొదటి సూర్య కిరణాలు దానిమీద పడాలి అలా పడలేదు అంటే ప్రళయం సంభవిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి నుంచి ఉద్భవించే కిరణాలు భూమికి చేటు చేస్తుంటాయని, వాటిని ఆపే శక్తి జువా అనే లోహ గోళానికి ఉందని.. భూమికి నష్టం కలగనివ్వకుండా ఆ జువాని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఒక ఆఫ్రికన్‌ తెగ వారు తీసుకున్నారని..మరోఖ వెర్షన్ కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే అఖిల్ దివ్య (సయేషా సైగల్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ దివ్యకి అప్పటికే పెళ్లి సెటిల్ అయ్యి ఉంటుంది, కానీ దానిని అఖిల్ సీక్రెట్ గా చెడగొట్టడంతో దివ్య హైదరాబాద్ వదిలి స్పెయిన్ వెళ్ళిపోతుంది. దివ్యని వెతుక్కుంటూ స్పెయిన్ వెళ్ళిన అఖిల్ ఫైనల్ గా దివ్యని ప్రేమలో పడేస్తాడు. అదే టైంలో అఖిల్ గురించి తెలుసుకున్న దివ్య ఫాదర్ మహేష్ (మహేష్ మంజ్రేకర్) అఖిల్ ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అదే టైంలోనే జువా కోసం వెతుకుతున్న మోంబో దివ్యని కిడ్నాప్ చేస్తాడు. జువా కోసం దివ్యని మోంబో ఎందుకు కిడ్నాప్ చేసాడు? జువాకి దివ్యకి ఉన్న సంబంధం ఏంటి? కథ అంత ఇదేదో రొటీన్‌కి భిన్నమైన ఫాంటసీ సినిమా అనిపిస్తుంది. ఆ జువాని దక్కించుకోవాలని విలన్‌ ప్రయత్నాలు, ఆ క్రమంలో హీరో అతనికి ఎదురు పడడాలు, ఫైనల్‌గా దుష్టసంహారం. ఇంతే కథ.

అలజడి విశ్లేషణ:

తండ్రిలా వెరైటీ వెరైటీ కథనో, అన్నయ్యలా లవర్‌బాయ్‌గానో ట్రై చేయకుండా ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే కమర్షియల్‌ హీరోగా నిలబడిపోవాలనే ఆశయంతో వి.వి. వినాయక్‌లాంటి మాస్‌ పల్స్‌ తెలిసిన డైరెక్టర్‌తో మొదటి సినిమా సైన్‌ చేశాడు. వినాయక్‌ డైరెక్టర్‌, హీరో నితిన్‌ ప్రొడ్యూసర్‌, ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, కోన వెంకట్‌లాంటి చేయి తిరిగిన రైటర్‌.. ఇలా అఖిల్‌ ఫస్ట్‌ మూవీకి సెటప్‌ బాగా కుదిరింది.కాంబినేషన్‌ బాగానే సెట్‌ చేసుకున్నారు కానీ ‘కంటెంట్‌’ మీద ఫోకస్‌ పెట్టలేదు. కనీసం ఆ జువాపై ఫోకస్‌ పెడుతూ ‘దేవీపుత్రుడు’ తరహా గ్రాఫిక్స్‌ ప్రధాన సినిమా తీసినా ఎంతో కొంత కొత్తదనం ఉండేది…కుందేలుకి హార్ట్‌ ఆపరేషన్‌ చేయడం.. అది కూడా అఖిల్‌కి బ్లూ టూత్‌ ద్వారా రాజేంద్రప్రసాద్‌ పుస్తకాలు చదువుతూ చెప్తుంటే, అది విని హీరోయిన్‌కి వివరిస్తూ ఆమెతో ఆపరేషన్‌ చేయించడం, అది సక్సెస్‌ అవడం లాంటి సీన్‌ చూడగానే ఇక మిగతా సినిమాపై నమ్మకం సడలిపోతుంది. ఎలాంటి హైస్‌ లేకుండా ఫ్లాట్‌గా, బోరింగ్‌గా సాగిపోతున్న సినిమాని పాటలొచ్చినప్పుడల్లా అఖిల్‌ ఓన్‌ చేసుకున్నాడు. తన అద్భుతమైన డాన్సింగ్‌ స్కిల్స్‌తో ప్రతి పాటనీ విజువల్‌గా మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. డాన్స్‌ పరంగా నాగ్‌, చైతన్య నుంచి అంతగా ఆశించని  అక్కినేని అభిమానులకి ఇది నిజంగా స్వీట్‌ సర్‌ప్రైజే. సయేషా సైగల్ కి ఇది మొదటి మూవీ అయినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. లిప్ సింక్, సీన్ కి తగ్గా హావభావాలని ఇస్తూ మెప్పించింది. కొన్ని సాంగ్స్ లో సయేషా డాన్సుల్లో చూపించిన ఈజ్ కొన్ని చోట్ల అఖిల్ ని డామినేట్ చేస్తుంది. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మంచి నటనని కనబరిచి ఆడియన్స్ కి లైట్ గా సెంటిమెంట్ టచ్ ని ఇచ్చాడు. ఇక కమెడియన్స్ గా కనిపించిన బ్రహ్మానందం,

జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరిలు ఓకే ఓకే అనిపించేలా నవ్వించారు. కథనం సంగతి అలా ఉంచి కనీసం నటీనటుల నుంచి తనకి కావాల్సింది రాబట్టుకోవడంలో కూడా వినాయక్‌ ఫెయిలయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు కానీ, ఫాన్స్‌కి పూనకాలు వచ్చేసే హీరోయిజమ్‌ ఎలివేషన్లు కానీ, కడుపు చెక్కలయ్యే కామెడీ కానీ ఏదీ లేకుండా నిస్సారంగా సాగిపోయే అఖిల్‌ సినిమాకి పాటలు, హీరో, హీరోయిన్లే ఆకర్షణగా మారారు. హీరో నితిన్‌ ప్రొడ్యూసర్‌, ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, కోన వెంకట్‌లాంటి చేయి తిరిగిన రైటర్‌.. ఇలా అఖిల్‌ ఫస్ట్‌ మూవీకి సెటప్‌ బాగా కుదిరింది. ఒకప్పుడు బ్రహ్మానందాన్ని బ్రహ్మాండంగా వాడేసుకున్న దర్శకుల్లో శ్రీను వైట్ల, వినాయక్‌ ముందుండే వాళ్లు. వైట్ల మాదిరిగానే ఇప్పుడు వినాయక్‌ కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలో విఫలమయ్యాడు.

నటీనటుల ప్రతిభ:

అఖిల్‌:అఖిల్ తన అద్భుతమైన డాన్సింగ్‌ స్కిల్స్‌తో ప్రతి పాటనీ విజువల్‌గా మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. డాన్స్‌ పరంగా నాగ్‌, చైతన్య నుంచి అంతగా ఆశించని అక్కినేని అభిమానులకి ఇది నిజంగా స్వీట్‌ సర్‌ప్రైజే.అఖిల్‌కి కెమెరా బెరుకు లేదు. ఫోటోజెనిక్‌ ఫేస్‌, హాండ్‌సమ్‌ లుక్స్‌తో ఇన్‌స్టంట్‌గా ఇంప్రెస్‌ చేస్తాడు కానీ ఎక్స్‌ప్రెషన్స్‌, డిక్షన్‌పై ఫోకస్‌ పెట్టాలి. మొదటి సినిమాకే ఎక్కువ ఆశించడం తగదు కానీ కమర్షియల్‌ హీరోగా ఇది కాన్ఫిడెంట్‌ డెబ్యూనే అని చెప్పాలి.

సయేషా సైగల్: సయేషా సైగల్ కి ఇది మొదటి మూవీ అయినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. లిప్ సింక్, సీన్ కి తగ్గా హావభావాలని ఇస్తూ మెప్పించింది. కొన్ని సాంగ్స్ లో సయేషా డాన్సుల్లో చూపించిన ఈజ్ కొన్ని చోట్ల అఖిల్ ని డామినేట్ చేస్తుంది.

రాజేంద్ర ప్రసాద్ ఉన్నంతవరకు బాగా చేశాడు. కానీ ఆయన పాత్రను మధ్యలోనే అలా వదిలేశారు. బ్రహ్మానందం – వెన్నెల కిషోర్ తమదైన శైలిలో నవ్వించారు. సప్తగిరి మెప్పించలేకపోయాడు. మహేష్ మంజ్రేకర్ కు సరైన క్యారెక్టర్ పడలేదు. విలన్ పాత్ర కూడా పేలవంగా ఉంది. ఐతే బోడోగా చేసిన విలన్ ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు:

వి.వి. వినాయక్‌లాంటి మాస్‌ పల్స్‌ తెలిసిన డైరెక్టర్‌తో మొదటి సినిమా సైన్‌ చేశాడు. వినాయక్‌ డైరెక్టర్‌, హీరో నితిన్‌ ప్రొడ్యూసర్‌, ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, కోన వెంకట్‌లాంటి చేయి తిరిగిన రైటర్‌.. ఇలా అఖిల్‌ ఫస్ట్‌ మూవీకి సెటప్‌ బాగా కుదిరింది. కుర్ర హీరోలను వెండితెర మీద అద్భుతంగా చూపించే దర్శకుడు వినాయక్ ‘అఖిల్’ సినిమాతో మరోసారి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. తెర మీద అఖిల్ ని అద్భుతంగా చూపించడానికి వినాయక్ తెర వెనుక ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది.వినాయక్ ఒక కమర్షియల్ డైరెక్టర్ గా కొన్ని కమర్షియల్ అంశాలను మాత్రం పర్ఫెక్ట్ గా చూపించాడని చెప్పాలి. మిగతా కొన్ని కీలక అంశాల్లో వినాయక్ తన మార్క్ తో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో సినిమాకి బాగా హెల్ప్ అయిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే బాగా ఫెయిల్ అయిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వెలిగొండ శ్రీనివాస్ ఎంచుకున్న జువా బ్యాక్ డ్రాప్ స్టొరీ లైన్ బాగుంది, దానికోసం అనుకున్న ఆఫ్రికా నేపధ్యమూ బాగుంది.ఇక మిగిలిన వాటిల్లో అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్పెయిన్ లో, బ్యాంకాక్ లో షూట్ చేసిన ప్రతి ఎపిసోడ్ ని చాలా కలర్ఫుల్ గా గ్రాండ్ గా ఉండేలా చూపించాడు.

అనూప్ రూబెన్స్ – తమన్ అందించిన పాటలు బాగున్నాయి,మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సినిమాలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది. గౌతంరాజు చాలా వరకూ ఎడిట్ చేసి మనకు ట్రిమ్ వెర్షన్ అందించారు. ఎస్ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సింప్లీ సూపర్బ్.. కోన వెంకట్ డైలాగ్స్ చాలా వరకూ బాగానే పేలాయి. ఇక చాలా కర్చు పెట్టి చేసిన సిజి వర్క్ అయితే ఆకట్టుకునేలా లేదు.నిర్మాణ విలువలకు ఏమాత్రం ఢోకా లేదు. ఫైనల్ గా నితిన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ విలువలు కథా పరంగా బాగా రిచ్ గా కనిపిస్తాయి. ఒక్కో పాటకు రెండు మూడు సెట్లు.. భారీ ఫారిన్ లొకేషన్లు.. హంగామా చాలానే కనిపించింది.వీరు అంత పెట్టినా సిజి విజువల్స్ ని కేక అనుకునేలా చూపించలేకపోవడం బాధాకరం.

ప్లస్ పాయింట్స్:

  • అఖిల్
  • సయేశ సైగల్
  • సంగీతం, నేపధ్య సంగీతం
  •  సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • కథ
  • సెకండాఫ్
  • విలన్ రోల్
  • గ్రాఫిక్స్‌

                                              పంచ్ లైన్:” అఖిల్‌ “లో లేదు కానీ అఖిల్ లో ఉంది.

(Visited 112 times, 1 visits today)