Home / Entertainment / అఖిల్ యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు.

అఖిల్ యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు.

Author:

Akhil The power of jua censor report and release details

నటవారసుడే అయినా తోలి సినిమా రిలీజ్ కి ముందే తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని మార్కెట్ ని సృష్టించుకున్న యువ హీరో అఖిల్. మొదటి సినిమా నే బ్లాక్ బస్టర్ హిట్ ఐపోయింది అన్నంత కాన్ఫిడెన్స్ తో వస్తున్న సినిమా తన సొంత పేరుతోనే రావటం టాలివుడ్ లో అతని కి ఉండబోయే చరిష్మాని చెప్పకనే చెబుతోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న రెండో వారసుడి మొదటి సినిమా ఇది.

ఇప్పుడు ‘అఖిల్’ అన్ని విధాలా క్రేజీ సినిమాగా నిలవడంతో ఈ సినిమా విషయంలో ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనీ, ఇప్పటికి ఏర్పడిన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించాలనుకోవటం లేదట. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకూ పలు అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఆస్ట్రియా, స్పెయిన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది.కారణాలు ఏవైనప్పటికీ ఈ సినిమా దసరా రేసులో నిలవలేకపోయింది. ఇక వాయిదా పడినప్పట్నుంచే ఈ సినిమాపై రిలీజ్‌పై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. సినిమా డిసెంబర్ నెలకు వెళ్ళిపోయిందని, నవంబర్ నెలాఖర్లో విడుదవుతుందని ఇలా రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ఎట్టకేలకు కింగ్ నాగార్జున అఖిల్ సినిమా తాజా రిలీజ్ డేట్‌ను ప్రకటించేసి అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. దీపావలికే విదుదల అని పోయిన వారమే అనుకూన్నా అది పక్కా అని మాత్రం చెప్పలేక పోయారు ఐతే ఈ సంధిగ్ధాలన్నిటికీ తెర దించుతూ. దీపావళి కానుకగా నవంబర్ 11న అఖిల్ సినిమా విడుదల కానుందని నాగార్జున కొద్దిరోజుల క్రితమే స్పష్టం చేశారు.

చెప్పినట్టుగానే నవంబర్ 4 తేదీ మధ్యాహ్నం సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాని చూసి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. సెన్సార్ వారు అఖిల్ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా రన్ టైం ని కూడా 2గంటల 10 నిమిషాలకి లాక్ చేసారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తమిళంలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

(Visited 51 times, 1 visits today)