Home / health / అల్లం జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు.

అల్లం జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు.

Author:

అల్లం దీనికి గురించి తెలియని వారు ఉండరేమో ఎందుకంటే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఇది ఒక భాగం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లంని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన పూర్వికులు దాని ప్రాధాన్యత తెలిసే మనం రోజు తినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఇది మన శరీరంలోకి చేరే విధంగా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు అదే అలవాటు మనకు చేశారు. కానీ రానురాను మనం అల్లం తక్కువ మోతాదులోనే వాడుతున్నాం అనే చెప్పాలి. అయితే అల్లం కాస్త ఘాటుగా ఉండటం వల్ల దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే.. జ్యూస్ రూపంలో అంటే.. ఒక కప్పు అల్లం రసం తీసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలా తగినంత జ్యూస్ తీసుకోవడంవలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా!….ఒక్కాసారి చూద్దాం ….

allam-juice-will-give-good-health

  • అల్లం వంటల్లో అద్భుతమైన రుచినే అందిస్తూనే కడుపులోని మంటను కూడా తగ్గిస్తుంది.
  • విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. దీంతో అద్భుతమైన వైద్యం చేవచ్చని నాటు వైద్యులు చెపుతారు
  • అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది
  • రక్త శుద్దికి, అలాగే రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.
  • డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో అల్లం జ్యూస్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • అల్లంలో బయో యాక్టివ్ ఫెనోలిక్స్, నాన్ వొలాటైల్ ఉంటాయి.ఇవి కాన్సర్ ని నివారించడానికి ఉపయోగపడుతాయి.
  • గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది
  • మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • అల్లం వల్ల అల్సరు ఏర్పడదు. నోటి దుర్వాసనను పోగొడుతుంది, దంతాలను ఆరోగ్యముగా ఉండేలా చేస్తుంది.
(Visited 3,657 times, 1 visits today)