Home / Latest Alajadi / అమ్మకానికి అల్లాద్దీన్ గ్రామం

అమ్మకానికి అల్లాద్దీన్ గ్రామం

Author:

సాధారణంగా వేలం అంటే.. ఒక ఇళ్లో, స్థలమో, లేదంటే విలువైన ఆస్తో వేల౦ వేస్తుంటారనేదే మనకు తెలుసు. కానీ ఊరినే వేలం వేయడం ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైనా చూశారా ? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ వింత వేలం స్పెయిన్ లో జరిగింది. స్పెయిన్ లోని అల్లాద్దీన్ అనే ఒక గ్రామాన్ని వేలం వేస్తున్నాం అని ఆ గ్రామస్థులు ప్రకటించారు. ఒకరు కానీ, కొందరు కలిసి కానీ తమ గ్రామాన్ని వేలం లో పాల్గొని కొనుక్కోవచ్చు అని ఆ గ్రామస్తులు టెండర్ లో ప్రకటించారు. అయితే అల్లాద్దీన్ గ్రామానికి చెందిన దంపతులు తమ గ్రామాన్ని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారో… ఈ వేలం వేయడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Aladdin Village Sell in Spain

స్పెయిన్ లోని అల్లాద్దీన్ అనే గ్రామంలో కేవలం 15 మంది మాత్రమే నివసిస్తారు. పైగా ఈ ఊరిలోని అన్ని వ్యాపారాలన్నీ 15 మందీ కలిసే చేయడం గమనార్హం. మొబైల్ హోం, పార్క్, కేఫ్, హోటల్, బార్లతో పాటూ ఒక సూపర్ మార్కెట్ ఈ గ్రామస్తులంతా కలిసి నిర్వహిస్తుంటారు. ఇంకో విశేషం ఏంటి అంటే… ఏడాది పొడగునా, ఒక్కరోజు కూడా సెలవు లేకుండా వీరంతా పని చేస్తారు. అలాగే ఈ వ్యాపారాలన్నీ కూడా ప్రతి రోజూ తెరిచే ఉంటాయి. ఈ ఊరు మొత్తానికి అనఫిషియల్ ఓనర్లయిన రిక్, జుడీ బ్రెంగల్ దంపతులు 31 ఏళ్లుగా ఈ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఊరు వ్యాపారంలో కానీ, పర్యాటకంగా కానీ వీరి నిర్వహణలోనే అభివృద్ధి చెందింది. వీరి సలహాలు, సూచనలతోనే మిగిలిన గ్రామస్తులు నడుచుకుంటారు. అయితే ఇప్పుడు రిక్, జుడీ ల వయసు 70 ఏళ్లు దాటింది. వయసు మీద పడటంతో వీరికి గ్రామ నిర్వహణ భారంగా మారింది. అందుకనే మిగిలిన గ్రామస్తులతో చర్చించి గ్రామాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మగా వచ్చిన డబ్బుతో వేరే చోట ఎకడైనా తమ శేష జీవితాన్ని ఇబ్బంది లేకుండా గడిపేయాలనుకున్నారు ఆ గ్రామస్థులు.

ఇంకెందుకాలస్య౦ వెంటనే తమ గ్రామం వివరాలతో పాటూ.. మొత్తం ఊరు అమ్మకానికి ఉందని.. నచ్చినవాళ్ళు కొనుక్కోవచ్చు అని ఓ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చారు. తమ అల్లాద్దీన్ గ్రామం మొత్తాన్ని ఒక వ్యక్తీ గానీ, కొంత మంది వేర్వేరు వ్యక్తులు కానీ వేలంలో కొనుక్కోవచ్చని కూడా ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. భలే ఉంది కదా… నచ్చితే ఊరు ఊరే మన సొంతం అయిపోతుంది. ఎప్పుడో రాజుల కాలం లో విని ఉంటాం. ఇప్పుడు కొనుక్కుంటే వాళ్ళూ చెప్పుకోవచ్చు. ఈ మొత్తం ఊరు నాదే అని. మొత్తానికి ఇది అరుదైన అవకాశం ఎవరికైనా రాజులాగా జీవించాలనే కోరిక ఉన్నవారికి. చూద్దాం మరి ఎవరు కొనుక్కుంటారో ఈ అద్భుతమైన అల్లాద్దీన్ గ్రామాన్ని.

(Visited 708 times, 1 visits today)