Home / Entertainment / అభిమాని కోరిక తీర్చిన అల్లు అర్జున్.

అభిమాని కోరిక తీర్చిన అల్లు అర్జున్.

Author:

allu arjun full fills his fan wish in vijayawada

సినీ వెండితెరపై ఎన్నో మేజిక్స్ చేసే స్టార్ హీరోస్ మరియు హీరోయిన్స్ కి తాము ఎన్ని చేసిన అభిమానులను సంతృప్తి పరుచడనికే అంటారు. అభిమానులు కొందరు వాళ్ళ హీరోల కోసం ఏమైన చేస్తుంటారు. అందుకే హీరోలు,హీరొహిన్స్ అంటే ప్రాణం వారికి. కానీ హీరో,హీరోహిన్స్ అభిమానుల కోసం ఎం చేశారు అన్నదే ఇక్కడ ప్రస్తుత ప్రశ్న. కానీ కొందరు హీరోలు అభిమానుల కోసం ఏం చేయ్యడనికైన వెనుకడుగు వేయ్యరు అందులో ముఖ్యులు పవర్ స్టార్. తను తన అభిమానుల కోసం ఏం చేయ్యడనికైన,ఎంత దూరమైన వెల్లుతారు. అందుకే పవన్ అంటే తన అభినానులకు అంత ఇష్టం అందుకే వారి కోసం ఏం చేయడానికన్నా సిద్దమవుతూ ఉంటారు. ఈ మధ్య స్టార్ హీరోలు చావు బతుకుల్లో ఉన్న తమ అభిమానుల కోరికని తీర్చడానికి, ఓ సారి వెళ్లి వారిని పలకరించి సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ హీరోలను ఎంతగానో అభిమానించే ప్రేక్షకులపై కూడా హీరోలకు అభిమానం ఉంటుందని నిరూపించాడు అల్లు అర్జున్.

విజయవాడ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ళ ముసలవ్వ అయిన మస్తాన్బి మూత్రనాళ కాన్సర్ తో బాధపడుతోంది. తను ఇంకో 6 నెలల కంటే ఎక్కువ బతకదు. ప్రస్తుతం ఈ ముసలవ్వ తన కాన్సర్ కంటే, ‘నా చిన్నతనం నుంచి అల్లు రామలింగయ్యకి పెద్ద అభిమానిని, ఆయన తర్వాత అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. తనని చూడడమే నా చిరకాల కోరిక, తనని చూడకుండానే చనిపోతానని భయంగా ఉందని’ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ విషయం తేలుసుకున్న అల్లు అర్జున్ తనను చూడటానికి విజయవాడ వెళ్లాడు. దానితో మస్తాన్ బీ చాలా సంతోషం తో మాట్లాడుతూ ‘తను చనిపోయే లోపు అల్లు అర్జున్ ని కలుస్తానో లేదోనని బాధపడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని, అల్లు రామలింగయ్య గారి నుండి అల్లు అర్జున్ వరకు అందరు ఇష్టమేనని.., అల్లు అర్జున్ డాన్స్, ఫైట్స్, డైలాగులు అంటే చాలా ఇస్తామంటూ’ ఆనందభాష్పాలతో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం సరైనోడు షూటింగ్ లో బిజీగా ఉన్న తన అభిమాని చిరకాల కోరిక నెరవేర్చడానికి ఇంత దూరం వచ్చినట్లు అల్లు అర్జున్ తెలిపాడు. మస్తాన్ బీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపాడు.

(Visited 127 times, 1 visits today)