Home / Inspiring Stories / చావు బ్రతుకుల మధ్య ఉన్న పసికందు ప్రాణాన్ని నిలబెట్టిన అల్లు అర్జున్.

చావు బ్రతుకుల మధ్య ఉన్న పసికందు ప్రాణాన్ని నిలబెట్టిన అల్లు అర్జున్.

Author:

అమ్మ పొత్తిళ్ళలో ఆడుకోవలసిన ఏడునెలల పసికందు 15 వేల మందిలో ఒకరికి వచ్చే ఒక వింత వ్యాధితో ఆసుపత్రిలో మంచంపై జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. ఏ పూటకాపూట గడిస్తేనే అంటే చాలు అనుకునే నిరుపేద తల్లిదండ్రుల కడుపులో పుట్టిన బిడ్డ. ఆ పసికందు బ్రతకాలంటే ఖరీదైన ఆపరేషన్ చేయాలి. దానికి 25 లక్షలు అవసరం. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అప్పుడే ఆసుపత్రి డాక్టర్స్ ఈ విషయాన్నీ మీడియాకు చేరవేశారు. అది చూసిన మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 8 లక్షలు ఇచ్చి పసికందు ప్రాణాన్ని నిలబెట్టాడు.

allu-arjun-saved-life-of-a-baby

పశ్చిమ గోదావారికి జిల్లాకు చెందిన నాగార్జున, దుర్గప్రశాంతి ల కొడుకైన నితీశ్ కు జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముందుగా కామెర్లుగా భావించి హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించి పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలో అత్యంత ప్రమాదకరమైన ‘బిలియరీ అట్రీసియా’ అనే కాలేయ సంబంధిత వ్యాధిగా గుర్తించారు. ఈ విషయం తెలిసి అపోలో వైద్యులు చేరదీశారు. అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యుల బృదం ఏడూ నెలల పసికందును విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసింది. ఈ టీమ్ కు డాక్టర్ మనీశ్ సి వర్మ హెడ్ గా ఉన్నాడు.ఈ ఆపరేషన్ కు ఆ పసికందు తండ్రి నాగరాజు కాలేయం నుండి 15% వరకు కాలేయాన్ని తీసి చిన్నారికి అందించారు. ఆరునెలల వయస్సు, అయిదు కేజీల బరువు ఉండే పసికందుకు కాలేయ మార్పిడి చేయడం చాలా అరుదు అని అలాంటి వాటిని మేము విజయవంతంగా పూర్తిచేసి, ఆ చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేస్తున్నట్లు మనీశ్ సి వర్మ తెలిపారు.

ఈ చికిత్సకు మొత్తం 25 లక్షలు ఖర్చు కాగా మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకొని అల్లు అర్జున్ 8 లక్షలు ఇవ్వగా, ఏపీ ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 3 లక్షలతోపాటు మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న కొద్దీ మంది తలో చేయి వేసి ఆ చిన్నారిని బ్రతికించారు.

(Visited 3,640 times, 1 visits today)