Home / Entertainment / తమిళ డైరెక్టర్ తో స్టైలిష్ స్టార్ ద్వి భాషా చిత్రం.

తమిళ డైరెక్టర్ తో స్టైలిష్ స్టార్ ద్వి భాషా చిత్రం.

Author:

Allu-Arjun Movie with Linguswamy

బాహుబలి ఒక్క సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ దేశ వ్యాప్తంగా విస్తరించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు స్టార్ హీరోస్ పక్క రాష్ట్రాల్లో కూడా తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు హీరోస్ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పర భాషా లో తన మార్కెట్ ని పెంచుకునే ఆసక్తిచూపుతున్నాడు. మనోడికి మలయాళంలో కూడా క్రేజున్న విషయం తెలిసిందే, ఇప్పుడు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. తమిళనాట ప్రముఖ కమర్షియల్ డైరెక్టర్ అయిన ఎన్. లింగుసామి డైరెక్షన్ లో ఓ ద్విభాషా చిత్ర చేయడానికి సిద్దం అయ్యాడు. పందెం కోడి, ఆవారా, వెట్టై(తడాఖా) లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన లింగుసామి మార్చి నుంచి విశాల్ తో ‘పందెం కోడి’ సినిమాకి సీక్వెల్ తీయనున్నాడు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఉంటుందని వినికిడి.

(Visited 112 times, 1 visits today)